Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భోళా శంకర్: 126 అడుగుల కటౌట్.. ఏ హీరోకూ ఇంత ఎత్తులో..?

Advertiesment
Chiranjeevi
, మంగళవారం, 8 ఆగస్టు 2023 (10:03 IST)
Chiranjeevi
శివ దర్శకత్వంలో అజిత్, శ్రుతి హాసన్, లక్ష్మీ మీనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం తమిళ చిత్రం 'వేదాలం'. ఈ చిత్రాన్ని తెలుగులో "భోళా శంకర్"గా రీమేక్‌ చేశారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అతనికి జోడీగా తమన్నా, చెల్లెలుగా కీర్తి సురేష్ నటించారు. 
 
మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 11న విడుదల కానుంది. తెలుగులో గాడ్ ఫాదర్ సక్సెస్ తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
 
ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో 126 అడుగుల ఎత్తులో ఉన్న చిరంజీవి కటౌట్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేటలో 'బోళాశంకర్' సినిమా కోసం ఈ కటౌట్‌ను ఉంచారు. 
 
తెలుగు చిత్రసీమలో ఇప్పటివరకు ఏ నటుడికీ ఇంత ఎత్తైన కటౌట్ పెట్టలేదు. ఈ కటౌట్ చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. చాలామంది దాని ముందు నిలబడి సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఈ కటౌట్ ఫోటో వైరల్‌గా మారింది

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెర్రీ లాంటి భర్త దొరకడం నా అదృష్టం : ఉపాసన