Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా - పేరు కోవా ఫీనిక్స్ డోలన్

Advertiesment
ileana
, ఆదివారం, 6 ఆగస్టు 2023 (10:17 IST)
'దేవదాస్' చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన గోవా బ్యూటీ హీరోయిన్ ఇలియానా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల ఒకటో తేదీన జన్మనిచ్చినట్టు ఆమె తాజాగా వెల్లడించింది. తన కుమారుడికి కోవా ఫీనిక్స్ డోలన్ అనే పేరు పెట్టినట్టు చెప్పారు. ఈ సందర్భంగా తమ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేమని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని బహిర్గతం చేయగానే సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. 
 
"మా డార్లింగ్ ఈ ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నందుకు ఎంత సంతోషంగా ఉన్నామో మాటల్లో చెప్పలేం. గుండె సంబరంతో నిండిపోయింది" అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం అభిమానులు, స్నేహితులు, ఇలియానాకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా, ఆమె తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ఈ యేడాది ఏప్రిల్ నెలలో వెల్లడించారు. ఆ తర్వాత జూలైలో తన ప్రియుడి ఫోటోలను కూడా షేర్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిస్టర్ ప్రెగ్నెంట్ ట్రైలర్ చూస్తే..సినిమా చూడాలనే ఆసక్తి కలిగింది - నాగార్జున