Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ను వదలని కరోనా మహమ్మారి.. కొత్త రికార్డు.. 24 గంటల్లో 132 మంది మృతి

Webdunia
గురువారం, 21 మే 2020 (12:25 IST)
భారత్‌ను కరోనా ఇప్పట్లో వదిలేట్టు లేదు. చైనా నుంచి పుట్టుకొచ్చి, ప్రపంచ దేశాలకు అంటుకున్న కరోనా వైరస్ కారణంగా జనాలు నానా తంటాలు పడుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు లాక్ డౌన్ విధించిన తరుణలో భారత్‌లో కరోనా కల్లోలం కొనసాగుతోంది.
 
రోజురోజుకు కరోనా కేసులు సంఖ్య తగ్గడం లేదు. కానీ రోజుకో కొత్త రికార్డు తరహాలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. సడలింపులతో నాలుగో దశ లాక్‌డౌన్‌ కొనసాగుతున్న మహమ్మారి నియంత్రణలోకి రావడం లేదు. కరోనా యాక్టివ్ కేసుల విషయంలో ప్రపంచంలోనే ముందున్న ఐదు దేశాలలో భారతదేశం చేరింది.
 
ఇక, గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 5,609 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన కోరాని హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. మరోవైపు గత 24 గంటల్లో భారత్‌లో 132 మంది కరోనా బారినపడి మృతి చెందారు. దీంతో.. మృతుల సంఖ్య 3,435కు చేరింది.
 
దేశవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,12,359కు చేరింది. ఇందులో ప్రస్తుతం 63,624కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.. 48,735 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రిల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

వాస్తవ సంఘటనలకు అద్దం పట్టే మిస్టర్ మాణిక్యం గా సముద్రఖని

సింగర్ మంగ్లీకి ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ పురస్కారం ప్రదానం

దేవీశ్రీ ప్రసాద్ లేనిదే నా జర్నీ శూన్యం - నా లైఫ్ మార్చింది ఆ దర్శకుడే : తేల్చిచెప్పిన అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments