ఇస్రో మరో ఘనత సాధించింది. చంద్రుడిపై వుండే మాదిరి మట్టిని తయారుచేసి అబ్బురపరిచింది. ఈ ఆవిష్కరణకు గాను పేటెంట్ హక్కులను సొంతం చేసుకుంది. చంద్రమృత్తికను కృత్రిమంగా తయారు చేసే విధానాన్ని కనుగొన్నందుకు ఇండియన్ పేటెంట్ ఆఫీస్ ఇస్రోకు పెటెంట్‌ను మంజూరు చేసింది. ఈ పేటెంట్ హక్కులు ఇస్రో దరఖాస్తు చేసిన నాటి నుంచి మరో ఇరవై సంవత్సరాల పాటు ఉంటుంది.
ఈ మట్టి ఎందుకంటే.. భారత్ గతంలో తలపెట్టిన చంద్రయాన్‌లో విక్రమ్ మూన్ లాండర్.. చంద్రుడిపై దిగే సమయంలో విఫలమైంది. అయినా చంద్రుడిపై కాలు మోపేందుకు భారత్ మరో ప్రయత్నం చేస్తోంది. అదే చంద్రయాన్-2. ఈ ప్రయోగాల్లో భాగంగా విక్రమ్ లాండర్, ప్రజ్ఞాన్ రోవర్ మొదలైన వాటిని పరీక్షించేందుకు ఇస్రోకు చంద్రుని మీది ఉంటే వాతావరణాన్ని కృత్రిమంగా తయారు చేయాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో భవిష్యత్తులో కూడా తలపెట్టనున్న అనేక అంతరిక్ష ప్రయోగాలకు ఇది చాలా అవసరమౌతుంది. అయితే మొదట ఈ చంద్రమృత్తికను అమెరికా నుంచి దిగుమతి చేసుకుందామనుకున్నారు. అయితే అది చాలా ఖరీదైన వ్యవహారంతో కూడుకున్నది కావడంతో.. దేశీయంగా చంద్రుని మీద వుండే మట్టిని తయారు చేశారు.