Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జీశాట్-30 ప్రయోగం సక్సెస్ - 2020లో తొలి విజయం

జీశాట్-30 ప్రయోగం సక్సెస్ - 2020లో తొలి విజయం
, శుక్రవారం, 17 జనవరి 2020 (10:30 IST)
ఫ్రెంచ్ గయానా కేంద్రంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నిర్వహించిన ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం ఇక్కడ నుంచి ప్రయోగించిన జీశాట్ 30 శాటిలైట్ నింగిలోకి దూసుకెళ్లింది. భారత్‌కు చెందిన శక్తివంతమైన సమాచార ఉపగ్రహం జీశాట్‌ - 30 ప్రయోగం విజయవంతంగా ప్రయోగించింది. దీంతో 2020లో ఇస్రోకు లభించిన తొలి విజయం కావడం గమనార్హం. 
 
నాణ్యమైన టెలివిజన్‌ ప్రసారాలు, టెలీకమ్యూనికేషన్‌, బ్రాడ్‌క్రాస్టింగ్‌ సేవలు లక్ష్యంగా ఉపగ్రహం రూపొందించారు. ఫ్రెంచ్‌ భూభాగంలోని కౌరౌలోని అరియాన్‌ లాంఛ్‌ కాంప్లెంక్స్‌ నుంచి ప్రయోగించారు. శుక్రవారం తెల్లవారుజామున 2:35 గంటలకు ఉపగ్రహం ప్రయోగించారు. 38 నిమిషాల్లో అరియాన్‌-5 యుటెల్సాట్‌, జీశాట్‌ - 30 జీయోస్టేషనరీ ట్రాన్స్‌ఫర్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. కమ్యూనికేషన్ ఉపగ్రహమైన దీని బరువు 3357 కిలోలు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజధాని అమరావతే.. ఎక్కడికీ కదలదు : కమలసేన