Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానం.. భర్త ఎంత పనిచేశాడో తెలుసా? కరోనా మందు అని..?

Webdunia
గురువారం, 21 మే 2020 (12:16 IST)
భార్యపై అనుమానంతో ఓ భర్త చేసిన నిర్వాకం అతడిని జైలుపాలు చేసింది. వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీ అలీపూర్‌కు చెందిన ప్రదీప్‌(42).. తన భార్యకు ఓ హోమ్‌గార్డ్‌తో సంబంధముందని అనుమానించాడు. దీంతో ఆ హోమ్‌గార్డ్‌ కుటుంబాన్ని అంతమొందించాలని భావించి ఇద్దరు మహిళలను నియమించుకున్నాడు. ఆదివారం వారిని ఆరోగ్య కార్యకర్తల్లా హోమ్‌గార్డ్‌ ఇంటి కెళ్లమని చెప్పి, కరోనా వైరస్‌కు నివారణ మందు ఇస్తున్నట్లు నమ్మించాడు. 
 
అయితే విషం కలిపిన ఓ బాటిల్‌ను ఆ మహిళలు హోమ్‌గార్డ్‌ కుటుంబ సభ్యులకు ఇవ్వడంతో.. ఆ ఇంట్లోని ముగ్గురూ అది తాగి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై సమీపంలోని ఆస్పత్రికెళ్లడంతో బతికి బయటపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
 
కేసు విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరు మహిళల్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రదీప్‌ తమకు డబ్బులు ఇచ్చి ఇలా చేయమని చెప్పాడని మహిళలు విచారణలో చెప్పడంతో అతడ్ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. తన ప్రతీకారాన్ని తీర్చుకోడానికి ప్రదీప్ కరోనా వైరస్‌ను అవకాశంగా మార్చుకున్నాడని  పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

ప్రముఖ నటి రజిత కి మాతృవియోగం

అగ్రనటులతో టీవీ షోలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారా?

హరిహర వీరమల్లు విడుదలకు సిధ్ధమవుతోంది - డబ్బింగ్ షురూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments