Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పైస్ జెట్ సిబ్బందిని చితకబాదిన ఎస్ఐ... ఎందుకు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (12:43 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో స్పైస్ జెట్ ఉద్యోగిని ఓ ఎస్ఐ స్థాయి వ్యక్తి చితకబాదారు. తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వలేదన్న కారణంతో ఈ కిరాతక చర్యకు పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అహ్మదాబాద్‌కు చెందిన పోలీసు అధికారి ఒకరు ఢిల్లీకి వెళ్లేందుకు మరో ఇద్దరితో కలిసి స్పైస్ జెట్ ఎస్జీ-8194 అనే విమానంలో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. వీరంతా విమానాశ్రయానికి ఆలస్యంగా వచ్చారు. అప్పటికే బోర్డింగ్ ముగిసిందని, విమానంలోకి అనుమతించలేమని స్పైస్ జెట్ ఉద్యోగులు స్పష్టం చేశారు.
 
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ అధికారి ఓ ఉద్యోగి చెంప పగులగొట్టాడు. అతనితో ఉన్న మిగతా ఇద్దరు ప్రయాణికులు స్పైస్ జెట్ సిబ్బందితో గొడవకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎయిర్ పోర్టు సెక్యూరిటీ, సీఐఎస్ఎఫ్ స్టాఫ్ రావాల్సి వచ్చింది. 
 
ఆపై విమానాశ్రయ ఉద్యోగిని, పోలీసును, మరో ఇద్దరినీ తీసుకెళ్లి పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. అయితే, ఇరు పక్షాలు రాజీకి రావడంతో ఈ విషయమై ఎటువంటి కేసూ నమోదు కాలేదు. సదరు పోలీసు అధికారిని, అతనితో పాటు ఉన్న ఇద్దరినీ విమానంలో ప్రయాణించేందుకు మాత్రం స్పైస్ జెట్ అంగీకరించ లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments