Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

17-11-2020- మంగళవారం మీ రాశి ఫలితాలు-గాయత్రి మాతను ఆరాధిస్తే?

Advertiesment
17-11-2020- మంగళవారం మీ రాశి ఫలితాలు-గాయత్రి మాతను ఆరాధిస్తే?
, మంగళవారం, 17 నవంబరు 2020 (04:00 IST)
గాయత్రి మాతను ఆరాధిస్తే శుభం చేకూరుతుంది. 
 
మేషం: రవాణా రంగంలోని వారికి సంతృప్తి కానవస్తుంది. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ఇంటా బయటా స్త్రీల ఆధిపత్యం కొనసాగుతోంది. వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెళకువ అవసరం, బద్ధకాన్ని వదిలి చురుకుగా వ్యవహరించండి. 
 
వృషభం: ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు. బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు. ఏ మాత్రం పొదుపు సాధ్యం కాదు. మీకు తెలియకుండానే దుబారా ఖర్చులు చేస్తారు. మీ బాధ్యతలను ఇతరులకు అప్పగించడం మంచిది కాదు.
 
మిథునం: విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. సోదరీ సోదరులు, సన్నిహితులకు సంబంధించిన ఖర్చులు అధికం. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులు విద్యార్థుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
 
కర్కాటకం: ఒకే కాలంలో అనేక పనులు చేపట్టడం వల్ల కాంట్రాక్టర్లు సమస్యలకు లోనవుతారు. భాగస్వామ్యుల మధ్య విభేదాలు సృష్టించేవారు అధికం అవుతున్నారని గమనించండి. స్పెక్యులేషన్ అనుకూలించదు. గృహంలోని మార్పులు, చేర్పులు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. రాజకీయాల్లో వారికి ఆదరాభిమానాలు అధికం.
 
సింహం: చిన్న తరహా, కుటీర పరిశ్రమల వారికి ఆశాజనకం. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సామాన్యం. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆశాజనకం. ముఖ్యులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
 
కన్య: కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర, బంగారం వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తుల సహాయం పొందుతారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు ఒత్తిడి తప్పదు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేయవలసి ఉంటుంది. రాజకీయాల్లో వారికి గుర్తింపు లభిస్తుంది. 
 
తుల: వస్త్ర, బంగారం, వెండి, వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తప్పవు. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీ సాన్నిత్యం కోరుకుంటారు. ఉద్యోగస్తులకు ఒక అవకాశం చేతిదాకా వచ్చి వెనక్కిపోయే ఆస్కారం వుంది. ఆరోగ్య, ఆహార విషయాల్లో జాగ్రత్త అవసరం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. 
 
వృశ్చికం: కాంట్రాక్టర్లకు సదవకాశాలు లభించిన ఒత్తిడి చెప్పవచ్చు. నిరుద్యోగులలో నిరుత్సాహం, నిర్లిప్తత అధికమవుతాయి. ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చకండి. ప్రేమికులకు మధ్య ఊహించని మనస్పర్థలు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది.
 
ధనస్సు: ఇతరులకు పెద్దమొత్తంలో ధనసహాయం చేయడం వల్ల ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. అనుక్షణం మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచనలుంటాయి. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి.
 
మకరం: పారిశ్రామిక రంగంలోని వారికి సమస్యలు ఒక కొలిక్కిరాగలవు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మిత్రులతో సంభాషించడం వల్ల మీలో మానసిక ధైర్యం, కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటాయి. రుణాలు తీరుస్తారు. ఆడిటర్లకు అభివృద్ధి, ప్లీడర్లకు, వైద్యులకు గుర్తింపు పొందుతారు. 
 
కుంభం: కుటుంబ సౌఖ్యం అంతగా వుండదు. విద్యార్థినులలో ఏకాగ్రత లోపం వల్ల చికాకులు, మందలింపులు తప్పవు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, ఆరోగ్య విషయంలోను ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఖర్చులు అధికమవుతాయి. మీ పాత సమస్యలు, స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి రావడానికి మరికొంత సమయం పడుతుంది. 
 
మీనం: వైద్య, ఇంజనీరింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. ప్రైవేట్, పత్రికా సంస్థల్లో వారికి మార్పులు అనుకూలించవు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. రావలసిన ధనం వసూలు విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్వభూపాల వాహనంపై సిరుల‌త‌ల్లి