ఆ పాముకు నీళ్ల దాహం వేసిందో ఏమో కానీ.. బీరు క్యానులో..?

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (14:22 IST)
Sanke
ఆ పాముకు నీళ్ల దాహం వేసిందో ఏమో కానీ..  దాని కంటికి కనిపించిన ఖాళీ బీర్ క్యానులో నోరుపెట్టింది. అంతే ఖాళీ బీర్ క్యానులో తల చిక్కుకుపోయింది. దీంతో ఆ నాగరాజుకు చుక్కలు కనిపించాయి. ఈ ఘటన ఒడిశాలోని పూరీ జిల్లా బొలొంగొ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధంచిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
 
వివరాల్లోకి వెళితే.. ఎవ‌రో బీర్ క్యాన్ తాగి చెట్ల పొద‌ల మ‌ధ్య ప‌డేయ‌గా అందులో నాగుపాము త‌ల‌దూర్చింది. మ‌ళ్లీ బ‌య‌ట‌కు రాలేక‌పోయింది. జితేంద్ర మహాపాత్రొ పెరటిలో ఖాళీ బీర్ క్యాన్‌లో పాము ఉన్న‌  విష‌యాన్ని గుర్తించిన స్థానికులు ఆ పామును ర‌క్షించ‌డానికి ప్ర‌య‌త్నించారు.
 
స్థానికులు స్నేక్‌ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేశారు. వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్న హెల్ప్‌లైన్‌ సభ్యుడు సుశాంత కుమార్ బీర్ క్యాన్‌ను క‌ట్ చేశాడు. నాగుపాము గాయపడకుండా అందులోంచి బయటకు తీసి అట‌వీ ప్రాంతంలో విడిచి పెట్టాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments