Publish Date: Wed, 17 Nov 2021 (22:10 IST)
Updated Date: Wed, 17 Nov 2021 (22:13 IST)
మూగ జీవులకు సంబంధించిన వీడియోలు నెట్టింట ఫుల్‌గా అప్‌లోడ్ అవుతున్నాయి. తాజాగా మూడు నాగుపాముల ఫోటో నెట్టింటిని షేక్ చేస్తోంది. చెట్టును నరికివేసి ఉన్న మొద్దుపై అల్లుకున్న ఫోటో ఇటీవల ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. సోషల్ మీడియా వినియోగదారుల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఇలాంటి జీవుల నుంచి దూరంగా వుండాలని నెటిజన్లు అంటున్నారు.
ఈ మూడు నాగుపాముల ఫోటోలను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్‌ఎస్) అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఫోటోలు మూడు నల్ల నాగుపాములను భయంకరంగా చూస్తున్నట్లు వున్నాయి. ఈ ఫోటో వెంటనే వైరల్‌గా మారింది. నెటిజన్ల నుండి రియాక్షన్‌ల స్ట్రింగ్‌కు దారితీసింది. "బ్లెస్సింగ్స్... మూడు నాగుపాములు ఒకేసారి మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు" అనే క్యాప్షన్‌తో పాటు ఆఫీసర్ నందా ట్విట్టర్‌లో చిత్రాన్ని అప్‌లోడ్ చేశారు.
సెల్వి
Publish Date: Wed, 17 Nov 2021 (22:10 IST)
Updated Date: Wed, 17 Nov 2021 (22:13 IST)