Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో పెళ్లికి సిద్ధమైన వధువు.. చివరి నిమిషంలో మరో ప్రియుడుతో జంప్..

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (12:51 IST)
తన మనసుకు నచ్చిన ఓ యువకుడుని నాలుగేళ్ళ పాటు గాఢంగా ప్రేమించిన ఓ యువతి అతన్ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. కానీ, చివరి నిమిషంలో మరో ప్రియుడితో లేచిపోయింది. ఈ ఘటన చెన్నై నగరంలోని నుంగంబాక్కంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నుంగంబాక్కంకు చెందిన 23 ఏళ్ల యువతి ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. ఆమెకు అదే సంస్థలో పనిచేస్తున్న నెమిలిచ్చేరికి చెందిన యువకుడితో నాలుగేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 
 
వీరి ప్రేమను అంగీకరించిన ఇరు కుటుంబాలు బుధవారం ఓ కల్యాణమండపంలో వివాహం చేసే ఏర్పాట్లు ముగించారు. వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి వధూవరులు రిసెప్షన్‌ ఏర్పాటుచేసి బంధువులు, స్నేహితుల ఆశీర్వాదం తీసుకున్నారు.
 
వధూవరులు కల్యాణ మండపంలోని వేర్వేరు గదుల్లో బసచేశారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో వధువు తల్లి గదిలోకి వెళ్లి చూడగా కుమార్తె గదిలో కనిపించలేదు. దీంతో దిగ్భ్రాంతి చెందిన ఆమె కల్యాణమండపం, పరిసర ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
పోలీసుల విచారణలో, వధువు మరో యువకుడిని ప్రేమించిందని, అర్థరాత్రి అతనితో వెళ్లిపోయిందని తెలిసింది. ఈ నేపథ్యంలో, సదరు వధువు, ఆమె మరో ప్రియుడు గిండీ పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments