Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీహెచ్ఎంసీ మేయర్ పీఠం : పీజేఆర్ కుమార్తె అలకపాన్పు

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (12:32 IST)
హైదరాబాద్ నగర మేయర్ పఠీంపై గంపెడాశలు పెట్టుకున్న మాజీ మంత్రి, దివంగత పి.జనార్ధన్ రెడ్డి కుమార్తె పీజీ విజయలక్ష్మికి చుక్కెదురైంది. దీంతో ఆమె అకలబూని, మేయర్ ఎన్నికలో పాల్గొనకుండా ఇంటికి వెళ్లిపోయారు. 
 
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం గురువారం మధ్యాహ్నం జరుగనుంది. దానికంటే ముందు కొత్తగా ఎంపికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం జరిగింది. ఇక మేయర్‌, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోవాల్సి ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్‌ల పేర్లు ఖరారైపోయాయి. 
 
అయితే ఆశావహులు భారీగానే ఉన్నారు. కానీ అధిష్టానం టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలతను అధిష్టానం ఎంపిక చేసినట్లు తెలియవచ్చింది. దీం
 
తో మేయర్ పీఠంపై ఆశలు పెట్టుకున్న ఖైరతాబాద్ కార్పొరేటర్, పీజేఆర్ కూతురు విజయారెడ్డి అలకబూనారు. ప్రమాణ స్వీకారం చేసి మేయర్ ఎన్నికలో పాల్గొనకుండానే ఆమె అక్కడి నుంచి కారెక్కి వెళ్లిపోయారు. దీంతో టీఆర్ఎస్ నేతలు కంగుతిన్నారు.
 
గతంలో కూడా విజయారెడ్డికి మేయర్ పీఠం దక్కుతుందని పీజేఆర్ అభిమానులు, అనుచరులు భావించారు. అప్పుడు కూడా టీఆర్ఎస్ అధిష్టానం ఆమెను నిరాశపరిచింది. ఈసారైనా మేయర్ పీఠం దక్కుతుందని ఆమె భావించారు కానీ ఈసారి కూడా మొండి చెయ్యి చూపించడంతో విజయారెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనై మేయర్ ఎన్నికల్లో పాల్గొనకుండా వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments