కన్నబిడ్డను చంపేసి ప్రియుడితో లేచిపోయిన తల్లి

Webdunia
మంగళవారం, 28 జనవరి 2020 (12:36 IST)
ఆ కసాయి తల్లికి కన్నబిడ్డ కంటే ప్రియుడే ఎక్కువైపోయాడు. ప్రియుడుతో పడకసుఖాన్ని పంచుకునేందుకు పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను చంపేసి.. ఆ తర్వాత ప్రియుడుతో పారిపోయింది. ఈ దారుణం ఛండీఘర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఛండీఘర్‌కు సమీపంలోని బురాలి గ్రామానికి చెందిన దశరథ్‌ అనే వ్యక్తి భార్య, రెండున్నరేళ్ళ కుమారుడు ఉన్నాడు. దశరథ్‌ వృత్తి రీత్యా ఎలక్ట్రిషీయన్‌. అయితే ఆయన భార్యకు మరో వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. 
 
ఈ క్రమంలో ఆదివారం ఉదయం బాలుడిని తన ఇంట్లో బెడ్‌ బాక్స్‌లో కుక్కింది. అరవకుండా ఉండేందుకు బాలుడి నోట్లో బట్ట ముక్క కుక్కి.. తన ప్రియుడితో లేచిపోయింది. సాయంత్రం ఇంటికొచ్చిన దశరథ్‌ తన భార్య, కుమారుడి కోసం గాలించాడు. 
 
తొలుత బంధువుల ఇంటికెళ్లి ఉండొచ్చు అని దశరథ్‌ భావించాడు. కానీ బంధువుల ఇంటికి వారు వెళ్లలేదు. దీంతో భార్యకు ఫోన్‌ చేయగా.. బాలుడిని బెడ్‌ బాక్స్‌లో ఉంచినట్లు చెప్పింది. బెడ్‌ బాక్స్‌ను తెరిచి చూడగా పిల్లాడు ప్రాణాలు కోల్పోయి ఉన్నాడు. దశరథ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments