Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రైళ్లలో కూడా ఎల్టీసీపై రైల్వే ఉద్యోగులు ప్రయాణించవచ్చు : కేంద్రం

ఠాగూర్
గురువారం, 16 జనవరి 2025 (10:14 IST)
భారతీయ రైల్వే శాఖలో పని చేసే ఉద్యోగులు లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్‌టిసి) కింద తేజస్, వందే భారత్, హమ్‌సఫర్ వంటి లగ్జరీ రైళ్లలో కూడా ప్రయాణించవచ్చని కేంద్రం తెలిపింది. ప్రభుత్వ వార్తా సంస్థ పీటీఐ ప్రచురించిన కథనం మేరకు.. ఎల్‌టిసి కింద ఈ వివిధ రకాల ప్రీమియం రైళ్ల అనుమతికి సంబంధించి వివిధ కార్యాలయాలు, వ్యక్తుల నుండి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) అనేక సూచనలను స్వీకరించిన తర్వాత వాటిని విశ్లేషించి ఈ తరహా ఆదేశాలు జారీచేసింది. 
 
'ఈ విషయాన్ని ఆర్థిఖ శాఖతో సంప్రదించిన తర్వాత తుది నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో కాకుండా, తేజస్ ఎక్స్‌ప్రెస్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్, హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఎల్‌టిసి కింద ప్రయాణించవచ్చని అని డిఓపిటి జారీ చేసిన ఉత్తర్వును ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. ఈ మేరకు ఈ నెల 14వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎల్‌టిసిని పొందినప్పుడు ఇచ్చే వేతనంతో కూడిన సెలవుతో పాటు, రెండు ప్రయాణాలకు టిక్కెట్ రీయింబర్స్‌మెంట్ పొందుతారు. 
 
లీవ్ ట్రావెల్ కన్సెషన్ అంటే ఏమిటి? 
లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్‌టిసి) పథకం అనేది ప్రభుత్వ ఉద్యోగులు నాలుగు సంవత్సరాల వ్యవధిలో భారతదేశంలోని ఏ ప్రదేశానికైనా ప్రయాణించడంలో వారికి సహాయపడే రాయితీ ప్రయాణ సౌకర్యం. మినిస్ట్రీ ఆఫ్ రైల్వే  ప్రకారం, ఉద్యోగులకు హోమ్ టౌన్ ఎల్‌టిసిని ఒక్కొక్కటి రెండు సంవత్సరాల బ్లాక్‌లో రెండుసార్లు పొందడం లేదా రెండేళ్ల వ్యవధిలో ఒకసారి హోమ్ టౌన్‌ని సందర్శించడం, మరో రెండేళ్లలో భారతదేశంలోని ఏదైనా ప్రదేశాన్ని సందర్శించడం వంటి ఎంపిక ఉంటుంది. పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shaaree :: రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చిన శాడిజం ప్రేమకథ - శారీ మూవీ రివ్యూ

వరుణ్ తేజ్ లాంచ్ చేసిన చౌర్య పాఠం లో ఒక్కసారిగా సాంగ్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments