Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పండగ వేళ ప్రయాణికుల నిలువు దోపిడీ!

EV buses

ఠాగూర్

, శుక్రవారం, 10 జనవరి 2025 (14:10 IST)
పండగ వేళ ప్రయాణికులను ప్రైవేటు బస్సు యాజమాన్యాలు నిలువు దోపిడీ చేస్తున్నాయి. సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లాలని భావించే వారికి ఈ ప్రయాణ చార్జీలు షాక్‌కు గురిచేస్తున్నాయి. రైళ్లన్నీ ఫుల్ కావడంతో గత్యంతరం లేక ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి జేబులను ప్రైవేట్ బస్సు యజమానులు క్షవరం చేస్తున్నారు. రెగ్యులర్ బస్సు సర్వీసులు ఫుల్ కావడంతో అదనపు సర్వీసుల పేరుతో అందికాడికి దండుకుంటున్నారు. సీటుకో రేటు చొప్పున వసూలు చేస్తూ ప్రయాణికులకు సంక్రాంతి సంబరం లేకుండా చేస్తున్నారు.
 
సాధారణ రోజులతో పోలిస్తే ప్రత్యేక సర్వీసుల పేరిట 50 శాతం చార్జీలను అదనంగా వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు సరిపడా లేకపోవడంతో ప్రైవేటు ట్రావెల్స్ ఆశ్రయిస్తున్న వారు నిండా మునుగుతున్నారు. సాధారణ రోజుల్లో కేటగిరీని బట్టి రూ.1200 నుంచి రూ.3500 ఉండే చార్జీలు ప్రస్తుతం రూ.2500 నుంచి రూ.7 వేల వరకు పలుకుతున్నారు. 
 
అలాగే, హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి వెళ్లే ఏపీ స్లీపర్ బసుల్లో రూ.4239 నుంచి రూ.6239 వరకు వసూలు చేస్తున్నారు. అదే సాధారణ రోజుల్లో ఏసీ బస్సులో సీటర్ ధర గరిష్టంగా రూ.1849గా ఉండగా, ప్రస్తుతం రూ.5649 వరకు ముక్కుపిండి వసూలు చేస్తుంటారు. వోల్వోలాంటి బస్సుల్లో అయితే, ఇది రూ.6909గా ఉంది. అలాగే విజయవాడకు అయితే, గరిష్టంగా రూ.3599 వరకు తీసుకుంటున్నారు. 
 
మరోవైపు, ఆర్టీసీ బస్సులోనూ అదనపు ప్రయాణ చార్జీలను వసూలు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణాలోని పలు ప్రాంతాలకు తెలంగాణ ఆర్టీసీ 6432 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. వీటిలో 50 శాతం అదనపు చార్జీలను వసూలు చేస్తుంది. సాధారణ రోజుల్లో ఏసీ స్లీవర్ బస్సులో హైదరాబాద్ నుంచి విజయవాడకు గరిష్టంగా రూ.700 ఉండగా, ప్రస్తుతం రూ.1050 తీసుకుంటున్నారు. లహరి ఏసీ బస్సుల్లో ఈ ధర రూ.2310గా ఉంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రయాణికుడిని చితకబాదిన టీటీఈ.. ఎందుకో తెలుసా? (Video)