ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమార్తె ఆద్య, కుమారుడు అకీర కాశీ యాత్రకు వెళ్లారు. పవన్ మాజీ భార్య రేణు దేశాయ్‌తో కలిసి వారణాసిని సందర్శించారు. వారణాసిలోని ఆలయాలను సందర్శించేందుకు ఇద్దరు ఆటో రిక్షాలో ప్రయాణించారు.
అకిరా సామాన్య భక్తుడిలా హిందూ సంప్రదాయ దుస్తులను ధరించి చెల్లి ఆద్య తల్లి రేణు దేశాయ్‌తో కలిసి కాశీ క్షేత్రంలో ప్రముఖ దేవాలయాలను, గంగమ్మని దర్శించుకున్నాడు. అది కూడా కాశీ రోడ్ల మీద సామాన్యుల్లా ప్రయాణించారు.
కొంతమంది అభిమానులు వారిని గుర్తించి, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వీడియోలను ఫోటోలను పోస్టు చేశారు. ఆడంబరాలకు దూరంగా సాదాసీదాగా జీవించాలని చెప్తూ రేణు దేశాయ్ తన పిల్లలను చక్కగా పెంచుతుందని నెటిజన్లు కొనియాడుతున్నారు. నెటిజన్లు ఆ వీడియోలను షేర్ చేస్తూ తండ్రికి తగ్గ పిల్లలాంటు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.