Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అఖండ 2: తాండవం మహా కుంభమేళాలో షూటింగ్ ప్రారంభం

Advertiesment
mahakumba mela-Akanda2

డీవీ

, సోమవారం, 13 జనవరి 2025 (19:19 IST)
mahakumba mela-Akanda2
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ 'అఖండ 2: తాండవం' కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. ఇది వారి మునుపటి స్మాష్ హిట్ 'అఖండ' కు ఇది సీక్వెల్, మరింత హై -ఆక్టేన్ యాక్షన్, గ్రిప్పింగ్ డ్రామాను ప్రామిస్ చేస్తోంది. ఎం తేజస్విని నందమూరి సమర్పణలో ప్రతిష్టాత్మక 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
'అఖండ 2' న్యూ షూటింగ్ షెడ్యూల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాలో ఈరోజు ప్రారంభమైయింది. మూవీ యూనిట్ చాలా కీలకమైన సన్నివేశాలని మహా కుంభమేళాలో చిత్రీకరిస్తోంది.  
 
ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు వున్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే డైరెక్టర్ బోయపాటి శ్రీను అఖండ 2 ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు.  ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు, సినిమాటోగ్రాఫర్ సి రాంప్రసాద్, ఎడిటర్ తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్‌తో సహా అత్యున్నత సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు.
సెప్టెంబర్ 25, 2025న దసరా కానుకగా సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.
 
సాంకేతిక సిబ్బంది: రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట
బ్యానర్: 14 రీల్స్ ప్లస్, సమర్పణ: ఎం తేజస్విని నందమూరి, సంగీతం: థమన్ ఎస్, డీవోపీ: సి. రాంప్రసాద్, సంతోష్ D Detakaem ఆర్ట్: ఏఎస్ ప్రకాష్ఎడిటర్: తమ్మిరాజు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేవర 2కు కొరటాల శివ కసరత్తు పూజతో ప్రారంభం ?