నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకూ మహారాజ్. భగవంత్ కేసరి సినిమా విజయం తర్వాత బాలకృష్ణ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను జనవరి 12న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.
డాకూ మహారాజ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ప్రగ్యాజైశ్వాల్, ఊర్వశి రౌతేలా, శ్రద్దా శ్రీనాథ్ బాలయ్య సరసన నటించనున్నారు. దర్శకుడు బాబీ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమా ట్రైలర్లో బాలయ్య ఓ చిన్నారితో ఆడిపాడటం చూపించారు. ఆ చిన్నారి గురించి ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఈ సినిమాలో ఆమె రోల్ ఏంటని బాలయ్య ఫ్యాన్స్ కసరత్తులు చేస్తున్నారు. తాజాగా ఆ చైల్డ్ ఆర్టిస్టుతో బాలయ్యబాబు ఎమోషనల్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
డాకూ మహారాజ్ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు వేదా అగర్వాల్. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత బాలకృష్ణను విడిచి వెళ్లలేక ఆ చిన్నారి కన్నీళ్లు పెట్టుకుంది. దాంతో బాలయ్య ఆ పాపను దగ్గరకు తీసుకొని ఓదార్చారు. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.
బాలయ్యకు కోపం ఎక్కువ అని చాలామంది అనుకుంటారు. కానీ బాలయ్య మనసు బంగారం. ఇక అన్ స్టాపబుల్లో బాలయ్య తనలో ఉన్న చిలిపితనాన్ని , తోటి నటీనటులతో ఆయన ఎలా ఉంటారో బయటపెట్టింది.