Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అందగత్తెనుకాను, ఆరుడుగులు వుండనంటున్న శ్రద్ధా శ్రీనాథ్

Shraddha Srinath

డీవీ

, బుధవారం, 8 జనవరి 2025 (16:28 IST)
Shraddha Srinath
నటి శ్రద్ధా శ్రీనాథ్ జెర్సీ సినిమా తర్వాత మంచి ఫామ్ లోకి వెళ్ళింది. ఆ సినిమా తర్వాత అవకాశాలు చాలా వస్తాయని అనుకున్నారు. కానీ ఆమె పెద్దగా సినిమాలు చేయలేదు. దానికి కారణం చెబుతూ, నాకు తగిన పాత్రలు వస్తే చేస్తాను. నేను పెద్ద అందగత్తెను కాను. ఆరడుగుల అమ్మాయిని కాను చాలా సింపుల్ గా వుంటాను. నేను తినే ఆహారం కూడా సాత్వికంగా వుంటుంది. బెండకాయ కూర ఇష్టంగా తింటాను. ఆకుకూరలు తింటాను అని చెప్పింది.
 
ఆ తర్వాత మెకానిక్ రాకీ సినిమా కథ బాగా నచ్చి నేను నటించాను. నా పాత్రకు చాలా ప్రాధాన్యత వుంది. ఇప్పుడు లేటెస్ట్ గా బాలక్రిష్ణ నటించిన డాకు మహారాజ్ లో కూడా కథ దర్శకుడు బాబీ చెప్పినప్పుడు ఇతర పాత్రలు నిడివికంటే నా పాత్రకు ఎంత ప్రిఫరెన్స్ వుందని అని ఆలోచించి చేశాను అంది. ఈ సంక్రాంతికి మిగిలిన సినిమాల్లోనూ హీరోయిన్లు వున్నారు. ఎవరికి వారే టాలెంట్ వున్నవారు. వారికంటే తానేనీ ప్రత్యేకం కాదు. హిట్ అయితే అందరూ ప్రతిభావంతులుగానే ప్రజల్లోకి దూసుకుపోతారు అని వివరించింది.
 
బాలక్రిష్న గురించి చెబుతూ, మొదట ఆయన్ను చూసి డైలాగ్ చెప్పాలంటే చాలా భయమేసింది. ఎందుకు.. బయపడతావ్. అంటూ ధైర్యాన్ని నూరిపోశారు. బాలక్రిష్ణగారిని పేరు పెట్టిపిలిస్తే. అంత పెద్ద పేరు అవసరంలేదు. సింపుల్ గా బాలు అని చాలు అంటూ అన్నారని శ్రద్ధా చెప్పారు. ఈ సినిమాలో ఆమె పాత్ర చెల్లెలా? భార్య? అనేది ఈనెల 12న తెలుస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామోజీరావు ప్రశ్నకు రాజేంద్రప్రసాద్ బాధపడ్డాడు