Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

Advertiesment
Balakrishna, Pragya Jaiswal, Shraddha Srinath, oorvasi

డీవీ

, శనివారం, 11 జనవరి 2025 (07:48 IST)
Balakrishna, Pragya Jaiswal, Shraddha Srinath, oorvasi
వాడికి పదహారు  కత్తిపోట్లు ఓ బులెట్ గాయం అయినా కిందపడకుండా అందరిని నరికాడంటే వారు మనిషి కాదు. వైల్డ్ యానిమల్ అంటూ విలన్ అంటే, అందరూ చదవడంలో మాస్టర్స్ చేస్తారోమో, నేను చంపడంలో చేశా.. అంటూ వచ్చే బాలయ్య డైలాగ్ తో ట్రైలర్ విడుదలైంది. అనూహ్య స్పందన వస్తున్న ఈ ట్రైలర్ విడుదల అనంతరం హైదరాబాద్ లో నందమూరి బాలక్రిష్ణ మాట్లాడారు.
 
నందమూరి బాలకృష్ణ మరో వైవిద్యభరితమైన చిత్రం 'డాకు మహారాజ్'తో అలరించబోతున్నారు.  బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో 'డాకు మహారాజ్'ను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు. బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న 'డాకు మహారాజ్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది.
 
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, "తిరుమల తొక్కిసలాట ఘటన నన్ను ఎంతో కలిచివేసింది. ఆ ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. బాధాకర ఘటన చోటు చేసుకోవడంతో అనంతపురంలో తలపెట్టిన వేడుకను రద్దు చేయడం జరిగింది. నా అభిమానులు క్రమశిక్షణ కలిగిన సైనికులు. అందుకే వారు మా నిర్ణయాన్ని స్వాగతించారు. ఇన్ని లక్షల, కోట్ల మంది అభిమానులను పొందడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ముందుగా నాకు జన్మనిచ్చి, నన్ను ఆయన ప్రతిరూపంగా మీ హృదయాల్లో నిలిపిన దైవాంశ సంభూతులు, నా తండ్రి, నా గురువు, నా దైవం నందమూరి తారక రామారావుకి కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
 
నాకు ఎవరితోనూ పోలికలేదు.  నాకు నేనే పోటీ. నాకు పొగరు వుందని అంటుంటారు. అదే పొగరుతో క్యారెక్టర్ బిల్డప్ చేసుకుంటా. మహరాజ్ లా వుండాలనుకుంటాను. అందుకే డాకు మహారాజ్ అని పేరు పెట్టాను. ట్రైలర్ లో చూసింది కొంతవరకే అసలు కీలక పాయింట్ సినిమాలో వుంటుంది. నాకు సెకండ్ ఇన్నింగ్ రాబోతుంది. అఖండ 2లో చూస్తారు. ప్రతి సినిమా వైవిధ్యంగా చేసుకుంటుపోతున్నాను. 
 
అప్పట్లో 'ఆదిత్య 369'లో నేను పోషించిన కృష్ణదేవరాయ పాత్ర చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాంటి పాత్ర చేస్తే బాగుంటుందనే ఆలోచన నుంచి ఈ 'డాకు మహారాజ్' కథ పుట్టింది. ఈరోజు విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్ కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. బాలకృష్ణ నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అందుకు తగ్గట్టుగా ఈ ట్రైలర్ ఉంది. దర్శకుడు బాబీ ఆలోచనకు తగ్గట్టుగా, కెమెరామెన్ విజయ్ కన్నన్ గారు తన అద్భుత పనితీరుతో సన్నివేశాలకు ప్రాణం పోశారు. తమన్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అఖండ తరహాలో మరోసారి అద్భుతమైన సంగీతం అందించాడు. ఎడిటర్స్ రూబెన్, నిరంజన్ గారు, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్, ఫైట్ మాస్టర్ వెంకట్ ఇలా టీం అంతా మనసు పెట్టి పని చేశారు. ప్రతిభగల నటీమణులు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతమైన పాత్రలు పోషించారు. యానిమల్ రాకముందే బాబీ డియోల్ గారిని ఈ సినిమాలో తీసుకున్నాం. ఆయన పాత్ర కూడా చాలా బాగుంటుంది. మూడు వరుస ఘన విజయాల తర్వాత వస్తున్న 'డాకు మహారాజ్'తో మరో ఘన విజయాన్ని అందుకుంటాననే నమ్మకముంది. ఇక ముందు కూడా ఇలాగే మరిన్ని మంచి సినిమాలతో మీ ముందుకు వస్తున్నాను. సంక్రాంతికి విడుదలైన నా సినిమాలన్నీ ఘన విజయం సాధించాయి. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలవుతున్న 'డాకు మహారాజ్' కూడా ఘన విజయం సాధిస్తుంది. మీరు ఏం ఊహించుకుంటున్నారో అంతకంటే మించే ఈ సినిమా ఉంటుంది. అందరికీ సంక్రాంతికి శుభాకాంక్షలు." అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2025లో దుబాయ్ సందర్శించడానికి మహోన్నత కారణాలు