Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాదిలో కూడా బీయస్పీ పార్టీ పాగా వేసింది

మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రీయ పార్టీగా కొనసాగుతోంది. అలాంటి పార్టీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో, అలాగే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఓటమి పాలైంది. అయినప్పటికీ తాజాగా ఈ పార్టీ దక్షణాదిలో కూడా తమ పార్టీ జెండా ఎగురవేయాలని చ

Webdunia
బుధవారం, 6 జూన్ 2018 (21:53 IST)
మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రీయ పార్టీగా కొనసాగుతోంది. అలాంటి పార్టీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో, అలాగే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఓటమి పాలైంది. అయినప్పటికీ తాజాగా ఈ పార్టీ దక్షణాదిలో కూడా తమ పార్టీ జెండా ఎగురవేయాలని చూస్తోంది. ఆ దిశగా తొలి అడుగు వేసింది. 
 
అందులోనూ నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటకలో జరిగిన ఎలక్షన్‌లో బీఎస్పీ తరపున గెలుపొందిన కొల్లేగల ఎమ్మెల్యే ఎన్. మహేష్ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో తొలిసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. కర్ణాటకలో 23 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసారు. అందులో బీఎస్పీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఉండటం గమనార్హం. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా మోడీ వ్యతిరేక పార్టీలన్ని ఐక్యతా రాగాన్ని పాడుతున్నాయి. రాబోయే 2019 ఎన్నికలలో బీఎస్పీ పార్టీ దక్షణాదిలో కూడా తమదైన ముద్ర వేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments