Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మా శక్తేంటో తెలిసింది.. బీజేపీతో పొత్తు ఉండదు.. ఒంటరిపోరే : 'సామ్నా'లో శివసేన

మహారాష్ట్రలోని పాల్ఘర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తమ శక్తి ఏంటో తెలిసిందనీ, అందువల్ల వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదనీ శివసేన స్పష్టంచేసింది. ఈ మేరకు

మా శక్తేంటో తెలిసింది.. బీజేపీతో పొత్తు ఉండదు.. ఒంటరిపోరే : 'సామ్నా'లో శివసేన
, బుధవారం, 6 జూన్ 2018 (15:57 IST)
మహారాష్ట్రలోని పాల్ఘర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తమ శక్తి ఏంటో తెలిసిందనీ, అందువల్ల వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదనీ శివసేన స్పష్టంచేసింది. ఈ మేరకు ఆ పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది.
 
ఇటీవలే జరిగిన మహారాష్ట్రలోని పాల్ఘర్ ఉపఎన్నికలో పార్టీ పనితీరును ప్రస్తావిస్తూ... ఈ పోలింగ్ ఫలితాలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరి పోస్టర్ కూడా తమకు అవసరం లేదని స్పష్టం చేశాయని అభిప్రాయం తెలియజేసింది. ఇరు పార్టీల అగ్రనేతల భేటీకి ముందు సామ్నా సంపాదకీయం రూపంలో శివసేన తన విధానం ఏంటో పరోక్షంగా తెలియజేసింది.
 
'ఇటీవలి ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత బీజేపీ ఎందుకని సంపర్క్ ఫర్ సమర్థన్ కార్యక్రమం చేస్తోంది? శివసేన 2019 సాధారణ ఎన్నికలను సొంతంగానే ఎదుర్కొంటుంది. పాల్ఘర్ ఉప ఎన్నిక పార్టీ శక్తి ఏంటో నిరూపించింది. బీజేపీ అధికారంలో ఉండి కూడా ప్రజలతో సంబంధాలను కోల్పోయింది. కానీ, శివసేన ప్రజలతో మమేకమవుతూ, ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తోంది. కనుక ఎన్నికల్లో గెలుపొందేందుకు ఏ పోస్టర్ బోయ్ అవసరం లేదు' అని సామ్నాలో శివసేన స్పష్టం చేసింది. దీంతో 2019 ఎన్నికల్లో శివసేనతో కలిసి ముందుకెళ్లాలన్న కమలనాథుల ఆశలు అడియాశలయ్యేలా కనిపిస్తున్నాయి. 
 
కాగా, 'సంపర్క్ ఫర్ సమర్థన్' పేరుతో దేశవ్యాప్తంగా పలు వర్గాలు, పార్టీల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కార్యక్రమం చేపట్టిన విషయం విదితమే. ఇందులో భాగంగానే షా బుధవారం బాలీవుడ్ బ్యూటీ మాధురీదీక్షిత్‌ను సైతం ముంబైలో కలుసుకున్నారు. అయితే, తాజా సామ్నా సంపాదకీయం ఈ కార్యక్రమాన్ని సైతం తప్పుబట్టడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేతులు కాలాక కాళ్లు పట్టుకునేందుకు సిద్ధమయ్యారు : మోడీ - షాలపై యనమల ఫైర్