Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీనియర్లతో చెలగాటమా? మోదీకి దిమ్మతిరిగింది.. అద్వానీతో భేటీ ఎప్పుడు?

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఖంగుతింది. అలాగే దేశంలో బీజేపీకి వ్యతిరేకత మొదలైందని.. మోదీ హవాకు బ్రేక్ పడుతోందని కర్ణాటక ఎన్నికలే చెప్పేశాయని విపక్ష పార్టీలు స్పష్టం చేశాయి. ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగడం,

సీనియర్లతో చెలగాటమా? మోదీకి దిమ్మతిరిగింది.. అద్వానీతో భేటీ ఎప్పుడు?
, బుధవారం, 6 జూన్ 2018 (10:56 IST)
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఖంగుతింది. అలాగే దేశంలో బీజేపీకి వ్యతిరేకత మొదలైందని.. మోదీ హవాకు బ్రేక్ పడుతోందని కర్ణాటక ఎన్నికలే చెప్పేశాయని విపక్ష పార్టీలు స్పష్టం చేశాయి. ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగడం, బీజేపీ తీరును శివసేన పార్టీ తూర్పారబట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రతికూల పరిస్థితులను అధిగమించి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనుకుంటున్న బీజేపీ కొత్త ఆలోచన చేసినట్టు తెలుస్తోంది.
 
ఇందులో భాగంగా సీనియర్ నేతలను మళ్లీ రంగంలోకి దించాలని భావిస్తోంది. 75 ఏళ్లకు పైబడిన వారిని ఎన్నికలకు, పదవులకు దూరంగా ఉంచాలని బీజేపీ అధిష్ఠానం గతంలో భావించింది. ఈ నిబంధనను బీజేపీ పక్కనబెట్టి సీనియర్లను రంగంలోకి దించాలని ప్లాన్ వేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ అగ్రనేతలు ఎల్ కే అద్వానీ, మురళీమనోహర్ జోషిలను ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. 
 
అప్పుడే బీజేపీకి వచ్చే ఎన్నికల్లో విజయం ఖాయమవుతుందని.. లేకుంటే బీజేపీ 2019 ఎన్నికల్లో తుడిచిపెట్టుకుని పోయే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎల్ కే అద్వానీ తిరిగి పోటీ చేస్తే బాగుంటుందని మోదీ అభిప్రాయపడుతున్నారని మీడియా కూడా కోడైకూస్తోంది.

ఈ విషయమై చర్చించేందుకు అద్వానీని మోదీ కలుస్తారని తెలుస్తోంది. మిగిలిన సీనియర్లతో కూడా చర్చలు జరిపేందుకు బీజేపీ నేతలు సంసిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాముడ్ని మోసం చేసిన బీజేపీ ఓడిపోతుంది.. పూజారి శాపనార్థాలు