రాముడ్ని మోసం చేసిన బీజేపీ ఓడిపోతుంది.. పూజారి శాపనార్థాలు
భారతీయ జనతా పార్టీకి వచ్చే ఎన్నికల్లో కష్టాలు తప్పేలా లేవు. ఒకవైపు ప్రజాగ్రహం మరోవైపు పూజారుల శాపనార్థాలు కలిసి ఆ పార్టీని చిత్తుగా ఓడించేలా కనిపిస్తున్నాయి.
భారతీయ జనతా పార్టీకి వచ్చే ఎన్నికల్లో కష్టాలు తప్పేలా లేవు. ఒకవైపు ప్రజాగ్రహం మరోవైపు పూజారుల శాపనార్థాలు కలిసి ఆ పార్టీని చిత్తుగా ఓడించేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉపఎన్నికల్లో వరుస పరాభవాలు ఎదురవుతున్నాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఆకాశం వైపు చూడటం మాని నేలచూపు చూస్తున్నారు.
శ్రీరాముడి పేరు చెప్పుకుని 2014లో అధికారంలోకి వచ్చి, ఆపై ఆయన్ను మరచిపోయినందునే భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో ఓడిపోతున్నదని అయోధ్య రామ జన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య ఎస్.దాస్ శాపనార్థాలు పెట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే, వెంటనే రామాలయ నిర్మాణాన్ని ప్రారంభించాలని, లేకుంటే బీజేపీకి అధికారాన్ని నిలుపు కోవడం క్లిష్టతరమవుతుందని ఆయన జోస్యంచెప్పారు.
ఇకపోతే, తక్షణమే రామమందిరాన్ని నిర్మించకుంటే ఉద్యమిస్తామని చావాని టెంపుల్ అర్చకుడు మహంత్ పరమహంస దాస్ హెచ్చరించిన గంటల వ్యవధిలోనే ఆచార్య దాస్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రామమందిరం కోసం ఉద్యమం జరిగితే బీజేపీకి ఓటమి తప్పదని, ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. గత ఎన్నికల్లో రాముడు పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన బీజేపీ.. వచ్చే ఎన్నికల్లో రాముడుని మోసం చేసినందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని వారు హెచ్చరించారు.