బెంగుళూరులో కుక్కలకు లైసెన్స్... లేదా పెనాల్టీ కట్టవలసిందింగా బీబీఎంసీ...
బెంగుళూరులో ఇళ్లలో కుక్కలను పెంచుకునేవారు ఇకపై న్యూ పెట్ లైసెన్స్‌ను తీసుకోవలసిందిగా బీబీఎంపీ నిర్ణయించింది. ఇక్కడ అపార్ట్‌మెంట్లలో ఒక ఫ్లాట్‌కు ఒక పెంపుడు కుక్కను మాత్రమే పెంచుకోవాలసి బెంగుళూరు మహానగర పాలకవర్గం నిబంధన జారీ చేసింది. ఒకవేళ ఆ అపార్ట్‌మ
బెంగుళూరులో ఇళ్లలో కుక్కలను పెంచుకునేవారు ఇకపై న్యూ పెట్ లైసెన్స్‌ను తీసుకోవలసిందిగా బీబీఎంపీ నిర్ణయించింది. ఇక్కడ అపార్ట్‌మెంట్లలో ఒక ఫ్లాట్‌కు ఒక పెంపుడు కుక్కను మాత్రమే పెంచుకోవాలసి బెంగుళూరు మహానగర పాలకవర్గం నిబంధన జారీ చేసింది. ఒకవేళ ఆ అపార్ట్‌మెంట్లలో ఇండిపెండెంట్‌గా ఉన్నవాళ్లు మాత్రం 3 కుక్కలు కంటే ఎక్కువగా పెంచుకోకూడదని బీబీఎంపీ తెలియజేసింది.
అంతేకాకుండా కుక్కలను పెంచుకోవాలంటే రేడియో కాలర్‌తో కూడిన ఎంబెడ్ చిప్ తీసుకోవాలి. బెంగుళూరులో కుక్కలను పెంచుకోవాలంటే లైసెన్స్‌ను తీసుకోవాలనీ, లేదంటే రూ. 1000 జరిమాన కట్టాల్సి వుంటుందని బీబీఎంసీ నిర్ణయించింది. ఈ మాటలు విన్న బెంగుళూరు ప్రజలు బీబీఎంసీపై మండిపడుతున్నారట. ఏం జరుగుతుందో చూద్దాం.