Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అయ్యప్ప స్వామి గురించి అంతా... స్వామియే శరణమయ్యప్పా...

శబరిమలై కేరళ రాష్ట్రంలో ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప. హిందువులు ఈయనను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. ఈ దేవాలయము సముద్ర మట్

Advertiesment
అయ్యప్ప స్వామి గురించి అంతా... స్వామియే శరణమయ్యప్పా...
, బుధవారం, 6 జూన్ 2018 (12:57 IST)
శబరిమలై కేరళ రాష్ట్రంలో ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప. హిందువులు ఈయనను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. ఈ దేవాలయము సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు, కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది. ఇక్కడ యాత్రలు నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో పూర్తవుతాయి.
 
ఈ దేవాలయానికి దక్షిణ భక్తులే ఎక్కువగా వస్తుంటారు. మండల పూజ నవంబర్ 17న, మకరవిళక్కు జనవరి 14 ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. జనవరి 14వ రోజున ఆలయంలో మకరజ్యోతి దర్శనమిస్తారు. మిగిలిన అన్నిరోజులలో గుడిని మూసే ఉంచుతారు. కానీ ప్రతి మళయాళ నెలలో 5రోజులపాటు తెరచి ఉంచుతారు.
 
అప్పట్లో శబరిమలైకి వెళ్లటానికి ఒక్కదారే ఉండేది అది ఎరుమేలిమార్గం. ఈ దారిలోనే పూజారులు సిబ్బంది ఆలయానికి గుంపులు గుంపులుగా వెళ్లేవారట. గర్భగుడిలో ఏకశిలా విగ్రహం 1907లో శబరిమల గర్భగుడిపైకప్పు ఎండుగడ్డితో ఆకులతో కప్పబడివుండేది. అప్పట్లో గర్భగుడిలో ఏకశిలా విగ్రహానికి పూజలు చేసేవారు. 1909లో దేవాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది.
 
1950 వరకూ పరుశురామ నిర్మితమైన దేవాలయం మూడుసార్లు అగ్నికి ఆహుతైంది. పంచలోహ విగ్రహానికై పూజలు 1909-10వ సంవత్సరంలో శిలా విగ్రహానికి బదులు పంచలోహాలతో తయారుచేసిన అయప్ప విగ్రహాన్ని ప్రతిష్టించారు. మకరజ్యోతి దర్శనానికై 1935 తరువాత భక్తుల సంఖ్య గణనీయంగా పెరగటంతో మకరజ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజకొరకు కూడా భక్తులను లోనికి ఆహ్వానించారు.
 
1946వ సంవత్సరంలో ఆలయబోర్డు కేవలం మకరజ్యోతి సమయంలోనే కాక విషు, పంకుని ఉత్తారం, ఓనం వంటి పండుగల సమయంలో కూడా ఆలయద్వారాలు తెరచి ఉంచేవారు. 1951లో పంచలోహ విగ్రహాన్ని చెంగనూరు నుండి తెప్పించి వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రతిష్టించారు. అప్పటి వరకూ కేరళీ కేళీ విగ్రహంగా కీర్తించబడ్డ అయ్యప్ప స్వామి భారతీకాళీ విగ్రహంగా నేడు భూతళీకేళీ విగ్రహంగా కీర్తించబడుతున్నది.
 
మకరజ్యోతి దర్శనం తెచ్చిన ఆభరణాలను స్వామి వారికి అలంకరించి కర్పూరహారతి ఇవ్వగానే తూర్పుదిక్కు పోన్నంబలమేడు నుండి భక్తులకు మకరజ్యోతి దర్శనం కానవస్తుంది. స్వామి వారి ఆభరణాలు పందళంలో భద్రపరచి ఉంచుతారు. ప్రతి ఏటా మకరసంక్రాంతి రోజున పెట్టలలో భద్రపరిచిన ఆభరణాలను 11 మంది మూడ రోజులపాటు మోసుకుంటూ వచ్చి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న శబరిమల చేరవేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రదోషకాలంలో అలాచేస్తే.. డబ్బు ఆదా అవుతుందట..