Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జిల్లేడును ఇంట్లో పెంచుకుంటే?

జిల్లేడు పాలు కళ్ళలో పడితే చూపుపోతుందని అంటారు. కానీ ఇక్కటి విషయమేటిటంటే ఈ మెుక్కలో ఉన్న ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారుచేస్తున్నారు. వీటిలో మూడుజాతులున్నాయి. తెల్ల జిల్లేడు, ఎర్ర జిల్లేడు, రాజు జిల

జిల్లేడును ఇంట్లో పెంచుకుంటే?
, మంగళవారం, 5 జూన్ 2018 (17:48 IST)
జిల్లేడు పాలు కళ్ళలో పడితే చూపుపోతుందని అంటారు. కానీ ఇక్కటి విషయమేమిటంటే ఈ మెుక్కలో ఉన్న ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారుచేస్తున్నారు. వీటిలో మూడుజాతులున్నాయి. తెల్ల జిల్లేడు, ఎర్ర జిల్లేడు, రాజు జిల్లేడు. తెల్ల జిల్లేడు స్వేతార్క మూలంగా సంబోదిస్తూ ఇందులో విజ్ఞాలు తొలగించే గణేశుడు నివశిస్తున్నాడని పెద్దలు చెబుతుంటారు.
 
తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి, తులసి మెుక్కలా ఇంట్లో నాటితే, ఈ మెుక్కలో ఉండే ధన ధాన్యాలు పుష్కలంగా లభిస్తాయి. స్వేతం అంటే తెలుపు వర్ణంగా అర్కా అంటే సూర్యుడు అని అర్థం. ఇంట్లో సిరిసంపదలు, జ్ఞానసంపదలు లభించాలంటే మహా గణపతికి పూజలు చేయాలి. ఇంట్లో ప్రశాంతంగా లేదనీ, ఎప్పుడూ ఏవో గొడవలు, చికాకులు ఉన్నాయని అనుకుంటే ఈ జిల్లేడు మెుక్కను ఇంట్లో పెట్టుకోవడం వలన అంతా మంచే జరుగుతుంది.
 
చిన్నపిల్లలు, మహిళలు రాత్రి సమయంలో నిద్రపోతూ కలలు కంటుంటారు. అటువంటివారు తెల్ల జిల్లేడు మెుక్కవేరును తలగడ కింద పెట్టుకుని పడుకుంటే భయాలన్నీ మాయమవుతాయి. జాతక దోషం ఉందనీ గ్రహదోషం ఉందని కొందరు అంటూ ఉంటారు. ఇటువంటి వారు తెల్ల జిల్లేడు మెుక్కను ఇంట్లో ఉంచుకుంటే వారికి దారిద్య్రం విషయాలు జరుగవు.
 
జిల్లేడు మెుక్కలు అధికంగా ఉన్న ఊళ్ళో పంటలు బాగా పండుతాయంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లేడు సిరిసంపదలకు చిహ్నం అని నమ్ముతారు. తెల్ల జిల్లేడు వేళ్ళు గనుక గణపతి రూపాన్ని సంతరించుకుంటే అది స్వయంభు శ్వేతార్క గణపతి అన్నమాట.
 
ఈ రూపాన్ని ఎలా పూజించాలంటే, ఈ గణపతికి ఎరుపు రంగంటే ఇష్టం. ఆసనం మీద కుంకుమ వేసి గణపతిని నిలిపి ఎర్ర వస్త్రం కప్పి నైవేద్యం సమర్పించి పగడాలు లేదా ఎర్ర రుద్రాక్షలతో పూజించాలి. మందార లాంటి ఎర్రటి పూలు, ఎర్ర చందనంతో పూజచేయాలి. శ్వేతార్క గణపతిని పూజించిన వారికి వెంటనే గొప్ప ఫలితాలు సాక్షాత్కరిస్తాయని ఎందరో అనుభవపూర్వకంగా చెప్పుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సత్యాన్ని తెలుసుకోవడానికి యేసు దగ్గరకు వస్తే...