భవన నిర్మాణ సమయంలో ఇవి తప్పకుండా చేయాల్సిందే...
భూమికి మూడు రకాల దోషాలు ఉన్నాయి. స్పర్శాదోష, దృష్టిదోషం, శాల్యాదోషం. స్పర్శాదోషం అనగా ముట్టుకుండే వచ్చే కొన్ని రకాల క్రిమికీటకముల వలన కలిగే దోషం. దృష్టి దోషం అనగా పరుల నరదృష్టి వల్ల వచ్చే దోషము. మృత్య
భూమికి మూడు రకాల దోషాలు ఉన్నాయి. స్పర్శాదోష, దృష్టిదోషం, శాల్యాదోషం. స్పర్శాదోషం అనగా ముట్టుకుంటే వచ్చే కొన్ని రకాల క్రిమికీటకముల వలన కలిగే దోషం. దృష్టి దోషం అనగా పరుల నరదృష్టి వల్ల వచ్చే దోషము. మృత్యదోషము లేదా శాల్యాదోషము అనగా మరణించిన శరీరము యెుక్క అవశేషాలు ఉన్నా, చనిపోయిన చోటుగా ఉన్న ఆ చోట దేవతావాహనం జరుగదు.
కాబట్టి అటువంటి చోట పవిత్రతను పెంచడానికి శంకువును స్థాపిస్తారు. దానిని భూమిపూజ లేదా వాస్తుపూజ అని అంటారు. ఆ చోట పవిత్రతను పెంచడం మళ్లీ పంచభూతాలతో నిర్మితమైన శరీరం లాంటి ఒక నిర్మాణాన్ని నిర్మిస్తున్నారు. కావున దానిలో ప్రాథమికమైన ప్రాణాన్ని నిలిపే ప్రక్రియను భూమిపూజ లేదా శంకుపూజ అంటారు.
పూజ చేసే విధానము ముందుగా యజమాని లేదా భూమి ఉన్న వ్యక్తి వారి పేరున యోగ్యమైన మంచి ముహుర్తమున చూసుకోవాలి. తరువాత పురోహితుని సహాయంతో పూజ ఏర్పాట్లు చేసుకోవాలి. మొదటి పూజ గణపతి పూజ ఆటంకములు విఘ్నములు తొలిగి ఇల్లు సుభిక్షంగా ఉండాలని చేసే పూజ. రెండవది పుణ్యాహవాచనము అన్ని రకముల మాలిన్యములు తొలగించి పవిత్రతను కలిగించే పూజగా పుణ్యాహవచనంగా చేస్తారు.
మూడవది సూర్యుడు మొదలైన తొమ్మిది గ్రహములను పూజిస్తారు. దీనివల్ల గ్రహదోషములు తొలగిపోతాయి. నాలుగవది వాస్తు పూజ శంకు పూజ చెక్కతో చేయబడినటువంటి శంఖానికి జనపనార చుట్టి రత్నముల చేత పొదిగి షోడశోపచారములు చేత పూజిస్తారు. ఈ శంఖాన్ని తీసుకొని కట్టడానికి ఈశాన్య భాగంలో భూమిలోపల స్థాపన చేసి పూజించి పూడ్చి వేస్తారు. దీనినే వాస్తు పూజ అనే పేర్లతో పిలుస్తారు.