13 ఏళ్ల ఈ వయసులోనే తన స్నేహితురాలిని బ్లాక్‌మెయిల్ చేశాడు. బెదిరింపులకు పాల్పడుతూ ఆమెతో చేయరాని పనులు చేయించాడు. విషయం బయటకు రావడంతో చివరికి అతడిపై పోలీసు కేసు నమోదైంది.
ముంబైకి చెందిన ఓ బాలుడు లాక్ డౌన్ సమయంలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 14 ఏళ్ల బాలికతో పరిచయం ఏర్పరుచుకున్నాడు. మెల్లగా ఆమెతో స్నేహం పెంచుకున్నాడు.
చాటింగ్‌తో మొదలైన స్నేహం వీడియో కాలింగ్ వరకూ వెళ్లింది. కానీ..ఏ సందర్భంలో కూడా తన వ్యక్తిగత వివరాలు బయటకు చెప్పలేదు.
ఓకానొక సందర్భంగా ట్రూత్ ఆర్ డేర్ ఆట పేరుతో.. నీకు ధైర్యం ఉంటే దుస్తులు తీసేయ్ అంటూ బాలికను రెచ్చగొట్టి..ఆ దృశ్యాలను బాలికకు తెలియకుండా రికార్డు చేశాడు.
ఆ తరువాత...ఈ విడియో సాయంతో ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. పలు మార్లు ఆమె చేత వీడియో కాలింగ్‌లో దుస్తులు తొలగించేలా చేశాడు.
అతడి వైఖరితో విసిగిపోయిన బాలిక అతడిని బ్లాక్ చేసింది. అయితే.. కొద్ది రోజుల క్రితం..అతడు మరో బాలికకు ఫాలో రిక్వస్ట్ పంపించాడు. ఆ తరువాత..ఆమెకు గతంలో అతడు రికార్డు చేసిన బాలిక వీడియో కూడా పంపించాడు. దీంతో ఆందోళన చెందిన ఆమె బాధితురాలకి కుటుంబాన్ని అప్రమత్తం చేసింది.
దీంతో వారు ఇటీవల పోలీసులను ఆశ్రయించారు. కాగా.. పోలీసుల దర్యాప్తులో మరో ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. ఆ ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుతున్నారని, బాలిక కంటే అతడు ఏడాది చిన్నవాడని తెలిసింది.
కాగా.. పోలీసులు అతడికి నోటీసులు పంపించడంతో పాటూ జరిగిన నేరం గురించి బాలుడి తల్లిదండ్రులకు తెలిపారు. ఈ కేసుపై త్వరలో బాల నేరస్థుల కోర్టులో విచారణ జరగనుంది.