Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిస్కెట్ తీసుకుందామని యంత్రంలో చేయిపెట్టిన చిన్నారి.. తర్వాత?

సెల్వి
బుధవారం, 4 సెప్టెంబరు 2024 (15:33 IST)
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ చిన్నారి తల్లి కళ్ల ముందే యంత్రంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే... థానే జిల్లాలోని ఆనంద్‌ నగర్‌ ప్రాంతంలో నివసిస్తున్న పూజా కుమారి.. అంబరనాథ్‌ ప్రాంతంలో ఉన్న ఓ బిస్కెట్‌ కంపెనీలో కార్మికులకు లంచ్‌ బాక్సులు సరఫరా చేస్తుంటారు. 
 
ఈ నేపథ్యంలో మంగళవారం ఆమె లంచ్‌ బాక్సులు ఇవ్వడానికి తన మూడేళ్ల కుమారుడు ఆయుష్‌ చౌహాన్‌ను వెంటబెట్టుకొని ఫ్యాక్టరీకి వెళ్లింది. ఆమె కార్మికులకు లంచ్‌ బాక్సులు ఇస్తున్న సమయంలో చిన్నారికి యంత్రంలోని పడిపోయిన బిస్కెట్‌ ముక్కలు కనిపించాయి. వెంటనే ఆ మెషీన్ లోని బిస్కెట్లు తీసుకునేందుకు ఆ చిన్నారి చేయి చాచింది. అంతే మెషిన్ లో ఉన్న బ్లేడ్‌కు మెడ చిక్కుకోవడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. 
 
కార్మికులు వెంటనే యంత్రాన్ని ఆఫ్‌ చేసి, ఆయుష్‌ను ఉల్హాస్‌నగర్‌లోని సెంట్రల్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 
 
అప్పటి వరకు అల్లరి చేస్తూ తన చుట్టూ తిరిగిన చిన్నారి విగతజీవిగా మారడంతో ఆ తల్లి రోదించిన తీరు అక్కడివారిని కలచివేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments