Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్ సెవెన్ గౌతమ్ కృష్ణ హీరోగా వస్తున్న సోలో బాయ్ టైటిల్ సాంగ్ లాంచ్

Advertiesment
Gautham Krishna,  Shweta Awasthi

డీవీ

, శనివారం, 24 ఆగస్టు 2024 (18:05 IST)
Gautham Krishna, Shweta Awasthi
బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ పై సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ నిర్మాతగా పి. నవీన్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా సోలో బాయ్. జుడా షాండి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి ఆట సందీప్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ సోలో బాయ్ టైటిల్ సాంగ్ నేడు ఘనంగా లాంచ్ చేశారు.
 
ఈ సందర్భంగా  కొరియోగ్రాఫర్ ఆట సందీప్ మాట్లాడుతూ :సోలో బాయ్ టైటిల్ సాంగ్ హుక్ స్టెప్ చాలెంజ్ చేసిన వాళ్లకి మొదటి బహుమతిగా 30,000 రెండవ బహుమతిగా 20,000 మూడో బహుమతిగా 10,000 ఇస్తాము.
 
డైరెక్టర్ పి. నవీన్ కుమార్  మాట్లాడుతూ :  సాంగ్స్ ఫైట్స్ ఎమోషనల్ సీన్స్ అన్నిటిలోనూ తనదైన శైలితో నటించాడు. సోలో బాయ్ టైటిల్ సాంగ్ లో డాన్స్ బాగా చేశాడు. ఈ సినిమా మొత్తం నన్ను సపోర్ట్ చేసిన నా టీం కి నటీనటులందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
 
ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ మాట్లాడుతూ : డైరెక్టర్ నవీన్ సైలెంట్ గా మంచి సినిమాను అందించడు. నేను ఇంట్రడ్యూస్ చేసిన త్రిలోక్ తల్వార్ చేస్తున్నాడు. బట్టల రామస్వామి బయోపిక్ చేసిన డైరెక్టర్ విశ్వక్సేన్ లైలా మూవీ డైరెక్టర్ చేస్తున్నాడు. నా తమ్ముడు గౌతమ్ కృష్ణ ఈ సినిమాతో హీరోగా ఇంటర్వ్యూస్ అవుతున్నాడు. గౌతమ్ ఫ్యూచర్లో కచ్చితంగా పెద్ద హీరో అవుతాడు. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.
 
హీరోయిన్ శ్వేతా అవస్థి మాట్లాడుతూ : నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ సతీష్ గారికి డైరెక్టర్ నవీన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. గౌతమ్ కృష్ణ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడు. టైటిల్ సాంగ్ లో డాన్స్ చాలా బాగా చేశాడు. ఈ సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.
 
హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ : హుక్ స్టెప్ చాలెంజ్ చేసి మమ్మల్ని, టీం ని ట్యాగ్ చేసి పోస్ట్ చేసిన వాళ్ళ నుంచి బెస్ట్ సెలెక్ట్ చేసి మీడియా ముందే బహుమతిని ఇస్తాము. నాలో ఉన్న డాన్సర్ని బయటికి తీసుకొచ్చింది సందీప్ మాస్టర్. నీలో మంచి రిథమ్ ఉంది కొంచెం కష్టపడితే కచ్చితంగా మంచి డాన్సర్ అవుతావు అని చెప్పారు. టైటిల్ సాంగ్ కాసర్ల శ్యామ్ గారు రాశారు రాహుల్ సిప్లిగంజ్ అన్న పాట అద్భుతంగా పాడాడు. ఇద్దరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి హిట్టయి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ముందు ముందు టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మీ ముందుకు వస్తాము. అదేవిధంగా నెగటివ్ ట్రోల్స్ చేసే అందరికీ ఒక ఫ్రెండ్ లా చెప్తున్నా మీ కెరీర్ మీద కాన్సెంట్రేట్ చేయండి. నెగిటివ్ కామెంట్స్ నెగటివ్ ట్రోల్స్ ఆపుకోండి.
 
నటీనటులు - గౌతమ్ కృష్ణ, శ్వేతా అవస్థి, రమ్య పసుపులేటి, పోసాని కృష్ణ మురళి, అనితా చౌదరి, షఫీ, ఆర్కే మామ, భద్రమ్, ఆనంద్ చక్రపాణి, సూర్య, ల్యాబ్ శరత్, అరుణ్ కుమార్, రజినీ వర్మ తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆయ్ చిత్రం 110 స్క్రీన్‌లతో మొదలై 382 స్క్రీన్‌లకు పెరిగిందన్న బన్నీ వాస్