Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కమల్ హాసన్ విక్రమ్ తర్వాత శివకార్తికేయన్ చిత్రం అమరన్ తెలుగు హక్కులను పొందిన శ్రేష్ఠ్ మూవీస్

Advertiesment
Sivakarthikeyan, sai pallavi

డీవీ

, శనివారం, 24 ఆగస్టు 2024 (15:55 IST)
Sivakarthikeyan, sai pallavi
ప్రిన్స్ శివకార్తికేయన్ ద్విబాషా యాక్షన్ చిత్రం అమరన్. ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియసామి రచన,  దర్శకత్వం వహించారు, ఉలగనాయగన్ కమల్ హాసన్, Mr. R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు.   ఈ దీపావళి అక్టోబర్ 31న చిత్రం థియేటర్‌లలో విడుదలకు సిద్ధంగా ఉంది.
 
కాగా, హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, అతని సోదరి నిఖితారెడ్డి ఈ సినిమా ఏపీ, టీఎస్‌ల థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సెన్సేషనల్ హిట్ విక్రమ్ తర్వాత కమల్ హాసన్ ప్రొడక్షన్ హౌస్‌తో శ్రేష్ట్ మూవీస్‌కి ఇది రెండవ చిత్రం కావడం విశేషం. 
 
విక్రమ్ చిత్రం సమయంలో చేసిన ప్రమోషన్లు,  భారీ విడుదల కోసం సుధాకర్ రెడ్డి చేసిన ప్రయత్నాన్ని కమల్ హాసన్ తన సంతృప్తిని వ్యక్తం చేశారు. శ్రేష్ట్ మూవీస్ ఇక్కడ విడుదల చేయడంతో తన చిత్రం అమరన్ మరింతగా విజయపథంలోకి వెళ్ళనున్నదనే నమ్మకాన్ని కమల్ హాసన్ వ్యక్తం చేశారు. 
 
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న అమరన్‌లో శివకార్తికేయన్ మునుపెన్నడూ చూడని సరి కొత్త గెటప్ లో కనిపించనున్నారు. ఆయన సరసన సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది.
 
అగ్రశ్రేణి సాంకేతిక బృందంలో సంగీత దర్శకుడు జి వి ప్రకాష్, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్, సినిమాటోగ్రాఫర్ సిహెచ్ సాయి, ఎడిటర్ ఆర్. కలైవానన్ మరియు యాక్షన్ డైరెక్టర్లు అన్బరివ్ మాస్టర్స్‌తో పాటు స్టీఫన్ రిక్టర్ ఉన్నారు.
 
ఈ చిత్రం "ఇండియాస్ మోస్ట్" అనే పుస్తకంలోని "మేజర్ వరదరాజన్" కథ ఆధారంగా రూపొందించబడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున - ఆపాలని హైకోర్ట్ స్టే