Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెండో వారంలో 141 అదనపు థియేటర్స్ పెరిగిన చియాన్ విక్రమ్ తంగలాన్

Advertiesment
Chian Vikram, Malavika Mohanan

డీవీ

, శుక్రవారం, 23 ఆగస్టు 2024 (17:08 IST)
Chian Vikram, Malavika Mohanan
ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన "తంగలాన్" సినిమా భారీ నిర్మాణ విలువలు, చియాన్ విక్రమ్ అద్భుత నటనతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. దర్శకుడు పా రంజిత్ మరోసారి తన వెండితెర మాయాజాలం చేశాడు. ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ ఈ నెల 15న థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అన్ని సెంటర్స్ నుంచి సక్సెస్ ఫుల్ టాక్ తో పాటు మంచి కలెక్షన్స్ రాబడుతోంది.

మొదటి వారంతో చూస్తే రెండో వారంలో "తంగలాన్" సినిమాకు తెలంగాణ, ఏపీలో అదనంగా 141 థియేటర్స్ పెరిగాయి. నైజాం ఏరియాలోనే 90 థియేటర్స్ జోడించారు. తెలుగు స్ట్రైట్ సినిమాలతో పాటు విడుదలైన "తంగలాన్" గట్టి పోటీని తట్టుకుని బాక్సాఫీస్ వద్ద బలంగా నిలబడింది. ఈ సినిమా దిగ్విజయానికి రెండో వారంలోనూ భారీగా పెరిగిన ఈ థియేటర్స్ నిదర్శనంగా నిలుస్తున్నాయి.
 
"తంగలాన్" చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందించగా..నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో మ్యాజికల్ రియలిజం స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన "తంగలాన్" అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తోంది.
 
నటీనటులు - చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఘనంగా హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరక్ వివాహం