Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై ఆధార్, పాన్‌కార్డులతోనే రైలు టికెట్ల బుకింగ్..!

Webdunia
శనివారం, 26 జూన్ 2021 (13:11 IST)
ఇకపై  ఎవరైనా వ్యక్తి ఐఆర్‌సీటీసీ ద్వారా రైల్వే టికెట్లను బుక్ చేయాలంటే.. ఆధార్, పాన్ కార్డు, పాస్‌పోర్ట్ వంటి ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాల్సిందే.

ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్‌లోకి లాగిన్ అవ్వాలంటే ఆధార్ కార్డు వివరాలనో, పాన్ కార్డు వివరాలోనో నమోదు చేయాల్సి ఉంటుంది. తద్వారా ఆ కార్డుకు  లింక్ అయి ఉన్న ఫోన్‌కు ఓటీపీ వస్తుంది.

ఆ తర్వాతే ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్‌లోకి లాగిన్ అయి టికెట్లను బుక్ చేసుకునే వీలు ఉంటుంది. ప్రస్తుతం ఈ తరహా విధానానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించే పనిలో నిపుణులు ఉన్నారని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ వెల్లడించారు. 
 
‘భవిష్యత్తులో ఆధార్, పాన్, పాస్‌పోర్ట్ వంటి ధృవీకరణ పత్రాల వివరాలు ఇవ్వకుండా రైల్వే టికెట్లను కొనుగోలు చేయలేరు. ఏదో ఒక ప్రూఫ్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఆ తర్వాతే టికెట్లను బుక్ చేయగలరు. దీని వల్ల రైల్వే టికెట్ల బుకింగ్స్‌లో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టొచ్చు. మా భవిష్యత్ ప్లాన్ ఇది. ఇది దాదాపుగా పూర్తయింది.

ఆధార్ కార్డుతో లాగిన్ అయ్యేందుకు సంబంధించి పని పూర్తయింది. మిగిలిన కార్డులతో కూడా ప్రయాణికుడు వెబ్‌సైట్‌లో లాగిన్ అవగలిగేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. త్వరలోనే ఇది కూడా పూర్తవుతుంది’ అని అరుణ్ కుమార్ చెబుతున్నారు.

2019వ సంవత్సరం నవంబర్ నెలలోనే దీనికి సంబంధించిన పనిని మొదలు పెట్టామని ఆయన వెల్లడించారు. 2021వ సంవత్సరం మే నెల వరకు టికెట్ల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్న 14,257 మందిని అరెస్ట్ చేశామని చెప్పుకొచ్చారు. 28.34 కోట్ల రూపాయల విలువైన టికెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments