Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ చిన్నారికి బాల్​ ఆధార్​ కార్డ్​ చేయించారా? లేదా, ఐతే ఇలా చేయంచండి

Advertiesment
మీ చిన్నారికి బాల్​ ఆధార్​ కార్డ్​ చేయించారా? లేదా, ఐతే ఇలా చేయంచండి
, శనివారం, 3 ఏప్రియల్ 2021 (17:12 IST)
ఆధార్.. ప్రతి భారతీయుని విశిష్ట గుర్తింపు. 12 అంకెలతో భారతీయ ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) ఆధార్​ నంబర్​ను దేశంలోని ప్రతి ఒక్కరికీ అందిస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థ చిన్నపిల్లల కోసం బాల్​ ఆధార్​ను తీసుకువచ్చింది. దీనితో నవజాత శిశువులకు కూడా ఆధార్​ కార్డును నమోదు చేసుకునే వీలు కలగనుంది.

5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారులు నీలి రంగులో ఉండే 'బాల్ ఆధార్'ను పొందవచ్చని యూఐడీఏఐ తెలిపింది. చిన్నారి ఐదేళ్లు పూర్తి చేసుకుంటే ఆ కార్డ్​ చెల్లదని స్పష్టం చేసింది. ఆ కార్డును తిరిగి రీయాక్టివేట్​ చేయించుకోవడం తప్పనిసరి అని పేర్కొంది. ఇందుకుగానూ బయోమెట్రిక్ అవసరమని ట్వీట్‌ చేసింది.
 
బాల్​ ఆధార్​ కూడా పెద్దవాళ్లకు ఇచ్చే కార్డు లాంటిదే. చిన్నారికి ఆ కార్డు చేయించాలంటే తప్పనిసరిగా తల్లిదండ్రులు ఆధార్​ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారి నుంచి ఎటువంటి బయోమెట్రిక్​ సమాచారాన్ని తీసుకోరు. వారికి కార్డుని ఉచితంగా అందిస్తారు. రీయాక్టివ్​ చేయించుకునే సమయంలో కచ్చితంగా వేలి ముద్రలు, ఫొటో, కనుబొమ్మలను స్కాన్​ చేస్తారు.
 
కావాల్సిన పత్రాలు ​..
చిన్నారి జనన ధ్రువపత్రం లేదా బడిలో చదివే పిల్లలు అయితే స్కూల్​ యాజమాన్యం ద్రువీకరించిన ఫొటో.
 
తల్లిదండ్రుల ఆధార్​ కార్డు వివరాలు.
 
అప్లై చేయడం ఎలా?
చిన్నారికి ఆధార్​ కార్డు నమోదు చేయించాలి అంటే ముందుగా దగ్గర లోని ఆధార్​ కేంద్రానికి వెళ్లాలి. తల్లిదండ్రుల ఆధార్​ కార్డు వివరాలతో సహా చిన్నారి జనన ధ్రువ పత్రాన్ని తీసుకువెళ్లాలి.
ఐదేళ్ల కన్నా ఎక్కువ వయసు ఉన్న వారి నుంచి బయోమెట్రిక్​ను తీసుకుంటారు.
 
తల్లిదండ్రుల ఆధార్​తో పిల్లల ఆధార్​ను అనుసంధానం చేస్తారు. చిన్న పిల్లల ఆధార్​ కార్డుకు ఎన్​రోల్​మెంట్​ చేసుకోవడం ఎలా ? ముందుగా యూఐడీఏఐ వెబ్​సైట్​కి వెళ్లాలి. ఆధార్​ కార్డ్​ రిజిస్ట్రేషన్​ లింక్​పై క్లిక్ చేయాలి. చిన్నారి పేరు, తల్లిదండ్రుల ఫోన్​ నంబర్​, ఈమెయిల్​ ఐడీ లాంటివి అందులో పొందుపరచాలి. వివరాలు నమోదు చేయడం పూర్తి కాగానే అక్కడ ఉండే ఫిక్స్​ అపాయింట్​మెంట్​ అనే బటన్​ను నొక్కాలి...   

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్యాస్‌ సిలిండర్‌పై ఏకంగా రూ.800 క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు.. తెలుసా? ఎలాగంటే?