పొట్టి దస్తులు ధరించే మహిళలు రాక్షసి శూర్పణఖలు : బీజేపీ మంత్రి కైలాస్ విజయ్

ఠాగూర్
శుక్రవారం, 6 జూన్ 2025 (10:08 IST)
మహిళలు పొట్టి దుస్తులు ధరించడం తనకు ఏమాత్రం నచ్చదని బీజేపీ నేత, మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి కైలాస్ విజయ్ వర్గీయ అన్నారు. ఇండోర్ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేయగా, ప్రస్తుతం వీటిపై తీవ్ర దుమారం రేగుతోంది. రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రిగా విధులు నిర్వహిస్తున్న విజయవర్గీయ మాట్లాడుతూ, మహిళలు చిట్టిపొట్టి దుస్తులు ధరించడం తనకు నచ్చదని అన్నారు. మహిళల ఆహార్యం విషయంలో పాశ్చాత్య, భారతీయ సాంస్కృతిక విలువల మధ్య వ్యత్యాసాన్ని వివరించే ప్రయత్నం చేశారు.
 
"పాశ్చాత్య దేశాల్లో తక్కువ బట్టలు వేసుకున్న మహిళను అందంగా భావిస్తారు. నేను దాంతో ఏకీభవించను. ఇక్కడ భారతదేశంలో ఒక అమ్మాయి చక్కగా దుస్తులు ధరించి, ఆభరణాలు అలంకరించుకుని, హుందాగా ఉంటే అందంగా పరిగణిస్తాం" అని వివరించారు.
 
పొట్టి ప్రసంగాలు, పొట్టి దుస్తుల మధ్య సారూప్యతను ఉదాహరిస్తూ విజయ్ వర్గీయ ఈ వ్యాఖ్యలు చేశారు. "పాశ్చాత్య దేశాల్లో తక్కువ దుస్తులు ధరించే మహిళను చాలా అందంగా భావిస్తారని, అలాగే తక్కువ మాట్లాడే నాయకుడిని మంచివాడిగా పరిగణిస్తారని ఒక నానుడి ఉంది. కానీ నేను దానిని నమ్మను. మహిళ దేవతా స్వరూపం అని నేను నమ్ముతాను. ఆమె మంచి దుస్తులు ధరించాలి" అని ఆయన పేర్కొన్నారు.
 
కొన్నిసార్లు తనతో సెల్ఫీలు దిగడానికి వచ్చే యువతులకు సరిగ్గా దుస్తులు ధరించమని తాను సలహా ఇస్తానని కూడా మంత్రి వెల్లడించారు. "కొన్ని సార్లు అమ్మాయిలు నాతో సెల్ఫీలు తీసుకోవడానికి వస్తారు. నేను వాళ్లతో 'బేటా, ఈసారి మంచి బట్టలు వేసుకుని రా, అప్పుడు ఫోటో తీసుకుందాం' అని చెబుతాను" అని ఆయన గుర్తుచేసుకున్నారు.
 
మహిళల వస్త్రధారణపై విజయ్ వర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. 2022లో ఇండోర్లో జరిగిన హనుమాన్ జయంతి కార్యక్రమంలో అసభ్యకరమైన దుస్తులు ధరించిన మహిళలను హిందూ పురాణాల్లోని రాక్షసి శూర్పణఖతో పోల్చారు. "మనం మహిళలను దేవతలు అంటాం. కానీ వారు అలా కనిపించరు... దేవుడు మీకు అందమైన శరీరాన్ని ఇచ్చాడు. కనీసం మంచి బట్టలైనా వేసుకోండి" అని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పెను దుమారమే చెలరేగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Boyapati Srinu: ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు. ఉన్నదంతా మంచి చెప్పడమే : బోయపాటి శ్రీను

Balakrishna:చరిత్రని సృష్టించేవాడు ఒకడే ఉంటాడు. నేనే ఈ చరిత్ర: నందమూరి బాలకృష్ణ

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments