Publish Date: Thu, 05 Jun 2025 (23:41 IST)
Updated Date: Thu, 05 Jun 2025 (23:42 IST)
మహిళలకు ఉలవలు ఎంతో మేలు చేస్తాయి. ఉలవలను డైట్‌లో చేర్చుకోవటం వల్ల మూత్రాశయ సమస్యలు తగ్గుతాయి. ఉలవల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని డైట్ లో చేర్చుకోవటం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఉలవలు జీర్ణ ప్రక్రియను మెరుగుచేస్తాయి. ఇంకా మోకాళ్ల నొప్పులు వుండవు. బరువు తగ్గాలనుకునే వారికి చక్కటి ఔషదంలా ఉపయోగపడతాయి.
కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారికి ఉలవలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఉలవల్లో ప్రోటీన్లు, ఐరన్, క్యాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవటం వల్ల పోషకాహార లోపం సమస్యను అధిగమించవచ్చు. ఇవి డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతాయి.
ఉలవలు తీసుకోవడం వల్ల అధిక ఫైబర్ కంటెంట్ లభిస్తుంది. ఫలితంగా మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది. ఉలవలు ఆకలిని పెంచుతాయి. మహిళలతో పాటు పిల్లలకు కూడా ఉలవలు పెడితే మంచిది.
సెల్వి
Publish Date: Thu, 05 Jun 2025 (23:41 IST)
Updated Date: Thu, 05 Jun 2025 (23:42 IST)