Webdunia - Bharat's app for daily news and videos

Install App

మురళీ మనోహర్ జోషీకి అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్

Webdunia
ఆదివారం, 25 ఆగస్టు 2019 (17:23 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన అగ్రనేతల్లో ఒకరైన మురళీ మనోహర్ జోషీ ఆస్పత్రి పాలయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖమాజీ మంత్రి అరుణ్ జైట్లీ శనివారం మధ్యాహ్నం కనుమూయగా ఆయన అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. ఈ అంత్యక్రియలు ముగిసిన తర్వాత బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషికి అనారోగ్యం ఉండటంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. 
 
తన నివాసంలో ఉండగా ఈ మధ్యాహ్నం ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు కాన్పూర్‌లోని రీజెన్సీ ఆసుపత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. వయో నిబంధన కారణంగా ఇటీవలి ఎన్నికలకు దూరంగా ఉన్న మురళీ మనోహర్ జోషి బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు. గతంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. 
 
కాగా, జోషి ఆరోగ్య స్థితి పట్ల బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొన్నిరోజుల వ్యవధిలోనే సుష్మ స్వరాజ్, అరుణ్ జైట్లీ కన్నుమూసిన సంగతి తెలిసిందే. అలాగే, గత యేడాది కాలంలో వాజ్‌పేయి నుంచి జైట్లీ వరకు అనేక మంది అగ్రనేతలు చనిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments