Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ... కన్నీటిని ఆపుకోలేక పోయిన వెంకయ్య

Webdunia
ఆదివారం, 25 ఆగస్టు 2019 (16:35 IST)
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. ఢిల్లీలోని యమునా నది తీరంలో ఉన్న నిగమ్ బోధ్ శ్మశానవాటికలో జైట్లీ అంత్యక్రియలు ముగిశాయి. ఓవైపు భారీ వర్షం కురుస్తుండగా, మరోవైపు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై జైట్లీ దహనసంస్కారాలను ఆయన కుమారుడు నిర్వహించారు. 
 
అధికార లాంఛనాల నడుమ జరిగిన జైట్లీ అంత్యక్రియలకు భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జైట్లీ అంత్యక్రియల సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయారు. జైట్లీతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుని వెంకయ్య తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. కాగా, జైట్లీ అంత్యక్రియలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, పలు రాష్ట్రాల సీఎంలు, రాజకీయపక్ష నేతలు హాజరయ్యారు.
 
అంతకుముందు జైట్లీ పార్థివ దేహాన్ని నాయకులు, అభిమానుల సందర్శనార్థం బీజేపీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉంచారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచి యాత్ర ప్రారంభించారు. పార్టీ కార్యాలయం నుంచి యమునా నది ఒడ్డున ఉన్న నిగంబోధ్‌ ఘాట్‌ వరకు యాత్ర కొనసాగింది. అక్కడ మధ్యాహ్నం 2.30 గంటలకు జైట్లీ మృతదేహానికి అంతిమ సంస్కారాన్ని కుటుంబ సభ్యులు నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments