Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హనీమూన్‌కు వెళ్తున్నారా? నేరుగా కాశ్మీర్‌కు వెళ్ళండంటున్న బిజెపి నేత?

హనీమూన్‌కు వెళ్తున్నారా? నేరుగా కాశ్మీర్‌కు వెళ్ళండంటున్న బిజెపి నేత?
, శనివారం, 24 ఆగస్టు 2019 (20:24 IST)
ఇప్పుడిప్పుడే కాశ్మీర్లో ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆర్టికల్ 370 రద్దుతో ఒక్కసారిగా కాశ్మీర్లో పరిస్థితి అదుపు తప్పిన విషయం తెలిసిందే. మోడీ నిర్ణయంపై కాశ్మీర్లో కొందరు ఆందోళనలు చేస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు తప్పుబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బిజెపి నేతలు 370 రద్దుపై విజయోత్సవ సభలను దేశంలోని 370 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు.
 
నరేంద్ర మోడీ ఆదేశాలతో మొదటి సభను తిరుపతిలో నిర్వహించారు. ఈ సభలో బిజెపి జాతీయ నేత రాంమాధవ్‌తో పాటు బిజెపి ఎపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలు పాల్గొన్నారు. ఈ సభలో రాంమాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోడీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని, దేశ ప్రజలందరూ ఎంతో సంతోషంతో ఉన్నారని, ఎవరో కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారని, అసలు 370 ఆర్టికల్ ఎవరినీ అడగకుండా తీసుకువచ్చారని... అందుకే మేము కూడా ఎవరినీ అడగకుండా రద్దు చేశామన్నారు రాం మాధవ్. 
 
మామూలుగా కొత్తగా పెళ్ళయిన జంటలు హనీమూన్‌కు వెళ్ళాలంటే స్విట్జర్ ల్యాండ్‌కో లేకుంటే ఏ ఇతర దేశాలకో వెళుతుంటారు. కానీ హనీమూన్‌కు కాశ్మీర్‌కు వెళ్ళండి.. అనువైన అద్భుతమైన పర్యాటక ప్రాంతం కాశ్మీర్ అంటూ చెప్పారు రాం మాధవ్. ప్రతి ఒక్కరు సంవత్సరంలో ఒకరోజు కాశ్మీర్‌కు వెళితే బాగుంటుందన్నారు. మరి ఎంతమంది కశ్మీర్ వెళ్తారో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జస్ట్ ఒక్క పాయింటుతో చేజారిపోయింది... చంద్రబాబు నాయుడు ట్వీట్