Webdunia - Bharat's app for daily news and videos

Install App

వణికిస్తున్న బర్డ్ ఫ్లూ... పది రాష్ట్రాల్లో విజృంభణ.. కేంద్రం హైఅలెర్ట్

Webdunia
మంగళవారం, 12 జనవరి 2021 (11:19 IST)
దేశంలో బర్డ్ ఫ్లూ వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. హర్యానా రాష్ట్రంలో వెలుగు చూసిన ఇది మెల్లగా పంజాబ్, కేరళ రాష్ట్రాలకు వ్యాపించింది. ఇపుడు ఏకంగా పది రాష్ట్రాల్లో వెలుగు చూసింది. 
 
ఢిల్లీ, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలో సోమవారం వందలాది పక్షులు మృతి చెందాయి. దీంతో మొత్తం 10 రాష్ట్రాలకు ఇది సోకింది. ఇప్పటికే కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, యూపీ బర్ద్ ఫ్లూతో సతమతమవుతున్నాయి. 
 
పౌల్ట్రీ ఫారాలు, జూలు వంటివాటి చోట్ల నిఘా పెంచాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీచేశారు. 
 
అదేసమయంలో బర్ద్ ఫ్లూ మనుషులకు వ్యాపించదని, ఆ భయం అక్కర్లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రజలు చికెన్, కోడిగుడ్లు తినవచ్చునని, అయితే బాగా ఉడికించిన వీటినే తినాలని సూచించింది. ఎక్కువ ఉష్ణోగ్రతలో వైరల్ నశించిపోతుందని పేర్కొంది.
 
కాగా, వివిధ రాష్ట్రాలు ఇప్పటికే బర్ద్ ఫ్లూ నేపథ్యంలో వివిధ నివారణా చర్యలు చేపట్టాయి. మరణించిన పక్షుల నమూనాలను విశ్లేషిస్తున్నారు . కోడిగుడ్లు, చికెన్ తినవచ్చునని యాడ్స్ ఇస్తున్నాయి. కానీ, కేరళ వంటి రాష్ట్రాల్లో చికెన్ మాంసం విక్రయాలపై నిషేధాజ్ఞలు విధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments