Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వీట్స్ కొనిస్తామని.. బాలికపై మూడు నెలలుగా గ్యాంగ్ రేప్.. వృద్ధుడు కూడా..

బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పదేళ్ల బాలికపై నలుగురు కామాంధులు మూడు నెలల పాటు అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పదేళ్ల బాలికకు స్వీట

Webdunia
శనివారం, 18 నవంబరు 2017 (13:40 IST)
బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పదేళ్ల బాలికపై నలుగురు కామాంధులు మూడు నెలల పాటు అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పదేళ్ల బాలికకు స్వీట్లు ఆశగా చూపి నలుగురు వ్యక్తులు మూడు నెలలుగా పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఐదో తరగతి చదువుతున్న బాలికపై.. వాచ్‌మన్‌గా పని చేస్తూ అదే కాలనీలో నివాసం ఉంటున్న నన్హూలాల్‌ (65), మరో ముగ్గురు వ్యక్తులు గోకుల్‌ పన్వాల్‌ (42), గ్యానేంద్ర పండిట్‌ (34), సుమన్‌పాండే (49) గత మూడు నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. నవంబర్ 12 కూడా బాలికపై ఈ నలుగురు అత్యాచారం చేశారు. 
 
అయితే వారి బెదిరింపులకు జడుసుకున్న బాలిక తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పలేదు. కానీ బాలిక ప్రవర్తనలో తేడా గమనించిన ఆమె తల్లిదండ్రులు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో స్వీట్లు తీసిస్తామని ఆ బాలికను లొంగ దీసుకున్న దుండగులు.. అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డారని వెల్లడైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం