Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌదీ మహారాజు కానున్న ఎంబీఎస్.. ట్రంప్ అభినందనలు

సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌ సౌదీ (ఎంబీఎస్‌) మహారాజు కానున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు సౌదీ అరేబియాలో రాజు మరణించాకే యువరాజుకు పట్టాభిషేకం చేసే సంప్రదాయం అమ‌లులో ఉంది. ఆ ట్రెండ్‌కు కింగ్‌ సల్మాన

Webdunia
శనివారం, 18 నవంబరు 2017 (13:22 IST)
సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌ సౌదీ (ఎంబీఎస్‌) మహారాజు కానున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు సౌదీ అరేబియాలో రాజు మరణించాకే యువరాజుకు పట్టాభిషేకం చేసే సంప్రదాయం అమ‌లులో ఉంది. ఆ ట్రెండ్‌కు కింగ్‌ సల్మాన్ స్వ‌స్తి చెప్ప‌బోతున్నారు.

అయితే, కింగ్ స‌ల్మాన్ ''మసీదుల సంరక్షకుడు" అనే హోదాలో కొనసాగ‌బోతున్నార‌ని సమాచారం. సౌదీ యువరాజు ప‌ట్టాభిషేకంపై సౌదీ ప్ర‌భుత్వం నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌క ముందే ఎంబీఎస్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభినందనలు తెలిపిన‌ట్లు కూడా మీడియాలో కథనాలు వస్తున్నాయి. 
 
ఇటీవల సౌదీ అరేబియా రాజ కుటుంబంలో 11మంది యువరాజులతో పాటు మాజీ మంత్రులు, ఓ కోటీశ్వరుడిని సౌదీ అరేబియా ప్రభుత్వం అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. రాజ కుటుంబంలో రాజ్య‌మేలుతున్న అవినీతిని అంత‌మొందించేందుకే ఎంబీఎస్ అరెస్టుల వ్యూహ రచన చేశారు. ఈ నేపథ్యంలో వచ్చేవారం కింగ్ సల్మాన్ తన కుమారుడు ఎంబీఎస్ సింహాసనాన్ని అప్పగించనున్నారని బ్రిటీష్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 
 
కాగా సౌదీ అరేబియా రాజ‌కుటుంబంలో అవినీతి ఆరోప‌ణ‌లు రావ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. రాచరిక వ్యవస్థ అవినీతి ఊబిలో కూరుకుపోవడంతో అధికారాన్ని ఎంబీఎస్ చేజిక్కించుకున్నాడు. తానే ఛైర్మన్‌గా అవినీతి- నిరోధక గ్రూప్‌‌ను ఏర్పాటు చేసి అక్ర‌మార్కుల‌ భ‌ర‌తం ప‌ట్టాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments