సౌదీ అరేబియాపై షితే హుతి రెబల్స్ క్షిపణి దాడి
గల్ఫ్ దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియాపై షితే హుతి రెబెల్స్ క్షిపణి దాడికి పాల్పడ్డారు. ఇరాన్ అండ కలిగిన ఈ రెబెల్స్ ఈ తరహా దాడికి పాల్పడటం ఇదేం తొలిసారి కాదు.
గల్ఫ్ దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియాపై షితే హుతి రెబెల్స్ క్షిపణి దాడికి పాల్పడ్డారు. ఇరాన్ అండ కలిగిన ఈ రెబెల్స్ ఈ తరహా దాడికి పాల్పడటం ఇదేం తొలిసారి కాదు.
అయితే, ఈ క్షిపణి దాడిని సౌదీ విజయవంతంగా నేలకూల్చింది. ఈ క్రమంలో దాని శకలాలు రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పడ్డాయి. ఈ మేరకు సౌదీ అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.
తమపైకి దూసుకొస్తున్న క్షిపణిని కూల్చేసిన సమయంలో కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద భారీ పేలుడు శబ్దం వినిపించింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. భారీగా ప్రాణనష్టం కలిగించే లక్ష్యంతో, జనావాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడి జరిగిందని అధికారులు తెలిపారు.
సుమారు 1200 కిలోమీటర్ల దూరం నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారని వెల్లడించారు. కాగా, యెమన్ దేశం నుంచి ఈ క్షిపణి దూసుకొచ్చిందని భావిస్తున్నారు.