Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డకు నిద్రమాత్రలిచ్చి అత్యాచారం.. సహకరించిన సవతి తల్లి.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (09:17 IST)
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. కామంతో కళ్లుమూసుకునిపోయిన ఓ కామాంధుడు కన్న కూతురన్న కనికరం కూడా లేకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు. కన్నబిడ్డకు నిద్రమాత్రలిచ్చి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయం తెలిసిన సవతి తల్లి నోరు మెదపకుండా మిన్నకుండిపోయింది. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ అభాగ్యురాలు ఆత్మహత్యకు ప్రయత్నించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ 19 ఏళ్ల యువతి తన తండ్రి(40), సవతి తల్లితో కలిసి బెంగళూరులో నివశిస్తోంది. అయితే కన్నతండ్రే ఆమెపై కన్నేశాడు. మంగళవారం దగ్గు, జలుబుతో ఆమె బాధపడుతుండటంతో ఇదే అదనుగా తీసుకున్నాడు. కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చి వేసుకోమన్నాడు. తండ్రి పాడు బుద్ధి గురించి ఏమాత్రం తెలియని ఆమె అమాయకంగా వాటిని వేసుకుంది. 
 
అంతే.. కొద్దిసేపటికే మైకం కమ్మి నిద్రలోకి జారిపోయింది. ఉదయం లేచేసరికి తాను అత్యాచారానికి గురైనట్లు తెలుసుకుంది. అది కూడా తన తండ్రే తనపై అత్యాచారం చేశాడన్న నిజాన్ని ఆమె నమ్మలేకపోయింది. 
 
వెంటనే సవతి తల్లి వద్దకు వెళ్లి ఈ విషయాన్ని చెప్పి వాపోయింది. అయితే ఆమె ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. 
 
టాయిలెట్లు శుభ్రం చేసే బిళ్లలను మింగేసింది. అయితే తనపై అత్యాచారం చేసిన తండ్రికి మాత్రం ఎలాగైనా శిక్ష పడేలా చేయాలని అనుకుంది. వెంటనే దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్నంతా చెప్పి అక్కడే కుప్పకూలిపోయింది. 
 
పోలీసులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో తండ్రిని అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. సవతి తల్లిపై కూడా విచారణ జరుగుతోందని వివరించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments