తనపై అత్యాచారం జరిగిన తర్వాత బాగా అలసిపోవడం వల్ల నిద్రపోయానని, అందువల్ల తనకు ఏం జరిగిందో గుర్తులేదని ఓ అత్యాచార కేసులోని బాధితురాలు కోర్టుకు తెలిపింది. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. పైగా, ఈ కేసులో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బాధితుడికి ముందస్తు బెయిల్ మంజూరుచేసింది.
కర్నాటకలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తాను తన కార్యాలయ సిబ్బంది చేతిలో అత్యాచారానికి గురైనట్టు ఓ యువతి కర్నాటక హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు.
ఈ కేసు విచారణ సందర్భంగా కేసు పెట్టిని యువతిపై హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'తనపై అత్యాచారం జరిగిన తర్వాత అలసిపోయానని బాధితురాలు చెప్పింది. ఇది చాలా దారుణం. భారతీయ మహిళ స్వభావం ఇది కాదు.
రాత్రి 11 గంటలకు ఆఫీసుకు వెళ్లడం, నిందితుడితో కలిసి మందు తాగడం, రాత్రంతా అక్కడే గడపడం వంటి చర్యలు అనుమానాలకు తావిస్తున్నాయి. వీటికి సంబంధించిన ఆమె చెపుతున్న సమాధానాలు సంతృప్తికరంగా లేవు' అని హైకోర్టు వ్యాఖ్యానించింది. అదేసమయంలో నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.