Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాకు షాకిచ్చిన బిహార్ : గాంధీ వంతెన టెండర్ రద్దు

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (09:00 IST)
బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చైనాకు షాకిచ్చారు. చైనా కంపెనీలతో భాగస్వామ్యంతో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ ప్రాజెక్టును రద్దు చేశారు. ఈ వంతెన నిర్మిస్తున్న కాంట్రాక్టర్లకు చైనాకు చెందిన రెండు కంపెనీలతో భాగస్వామ్యం ఉండటంతో ఈ టెండర్‌ను రద్దు చేశారు. భాగస్వాములను మార్చుకోమని చెప్పినా కాంట్రాక్టర్లు నిరాకరించడంతో చివరకు టెండర్‌నే రద్దు చేసినట్లు బీహార్ మంత్రి నంద్ కిశోర్ యాదవ్ తెలిపారు. 
 
జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరించి భారత జవాన్లపై రాళ్లు, మేకులు కొట్టిన లాఠీలతో దాడి చేసింది. ఈ దాడిలో 21 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. చైనా వైపునుంచి కూడా అనేక మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కానీ, ఈ విషయంపై చైనా ఎక్కడా పెదవి విప్పలేదు. అయితే, రెండు వైపులా నష్టం జరిగిందని మాత్రమే డ్రాగన్ కంట్రీ ప్రకటించింది. 
 
అదేసమయంలో జూన్ 15వ తేదీ దాడిలో చనిపోయిన భారత జవాన్లలో ఐదుగురు బీహారీలే ఉన్నారు. దీంతో చైనాపై బీహారీలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఈ క్రమంలోనే గాంధీ వంతెన టెండర్ రద్దు చేశారు. త్వరలో చైనాతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను బీహార్ ప్రభుత్వం రద్దు చేసుకునే అవకాశాలున్నాయి. మహారాష్ట్ర ఇప్పటికే చైనాతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments