Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

29-06-2020 సోమవారం రాశిఫలాలు - మల్లిఖార్జున స్వామిని ఆరాధిస్తే...

Advertiesment
29-06-2020 సోమవారం రాశిఫలాలు - మల్లిఖార్జున స్వామిని ఆరాధిస్తే...
, సోమవారం, 29 జూన్ 2020 (05:00 IST)
మేషం : కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రిప్రజెంటేటివ్‌లకు సదావకాశాలు లభిస్తాయి. విదేశీయానం కోసం చేసే యత్నాలు వాయిదా పడతాయి. కొందరి ప్రవర్తన మీకు విసుగుపుట్టిస్తుంది. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. 
 
వృషభం : కుటుంబీకుల మధ్య అవగాహనా లోపం ఏర్పడుతుంది. కొబ్బరి, మామిడి పండ్లు, పూల కూరగాయ రంగాలలో వారికి లాభదాయకం. సొంతంగా గృహం ఏర్పరచుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తే ఆస్కారం ఉంది. 
 
మిథునం : సొంతంగా గృహం ఏర్పరచుకోవాలోనే ఆలోచన స్ఫురిస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోనివారు అచ్చు తప్పు పడుటవల్ల మాటపడవలసి వస్తుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం. ఉద్యోగస్తులు నూతన పరిచయాల వల్ల అప్రమత్తంగా ఉండటం శ్రేయస్కరం. 
 
కర్కాటకం : ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ప్రముఖుల సిఫార్సుతో మీ పనులు సానుకూలమవుతాయి. ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయడి. స్త్రీలకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సేల్స్ సిబ్బందితో లౌక్యంగా మెలగాలి. బంధువులతో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. 
 
సింహం : అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలలో చికాకులు, ఇబ్బందులు వంటివి తప్పవు. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమ అధికం. ఆదాయం స్వల్పం. ప్రేమికులకు ఎడబాటు. ఊహించని చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించినా ఫలితాలొస్తాయి. 
 
కన్య : విద్యుత్, ఏసీ, కూలర్ మెకానికల్ రంగాలలోని వారికి సంతృప్తికానవస్తుంది. చెక్కుల జారీ స్వీకరణలో ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. రావలసిన మొండిబాకీలు సైతం వసూలుకాగలవు. 
 
తుల : ఫీజులు, పన్నులు, రుణ వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహరాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదాపడతాయి. 
 
వృశ్చికం : ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. రాజకీయ నాయకులు అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సోదరీ, సోదరుల మధ్య సంబంధం బాంధవ్యాలు బాగా ఉంటాయి. స్త్రీలకు ఆరోగ్య, సంతృప్తి, శారీరక పటుత్వం నెలకొంటాయి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో మెలకువ అవసరం. 
 
ధనస్సు : ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి. పాత పస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం కొంత ముందు వెనుకలుగానైనా పూర్తి అవుతుంది. స్త్రీల తెలివి తేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
మకరం : ఆర్థిక, పెట్టుబడుల గురించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. ఇతరుల స్థితిగతులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. మీ అవసరాలకు కావలసిన ధనం అందుతుంది. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి, యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. 
 
కుంభం : ఆదాయానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. చిన్నారులకు అవసరమైన వస్తువులను సేకరిస్తారు. ప్రముఖులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. పాత మిత్రులతో సంబంధ బాంధవ్యాలు మరింత బలపబడతాయి. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. 
 
మీనం : చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ పెట్టండి. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానులన్ని సంపాదించి పెడుతుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సదర్శిస్తారు. కళా, పోటోగ్రఫీ ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల రంగాల వారికి అనుకూల సమయం. బంధువుల కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

28-06-2020 ఆదివారం రాశిఫలాలు - సూర్యనారాయణ స్వామిని పూజిస్తే...