Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

24-06-2020 బుధవారం దినఫలాలు - గాయత్రీ మాతను ఆరాధిస్తే...

24-06-2020 బుధవారం దినఫలాలు - గాయత్రీ మాతను ఆరాధిస్తే...
, బుధవారం, 24 జూన్ 2020 (05:00 IST)
మేషం : స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారిక పర్యటనలు, బాధ్యతలు అధికమవుతాయి. నిర్మాణ పనులలో సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కలిసివచ్చే కాలం. దైవ కార్యాల్లో పాల్గొంటారు. సోదరీ, సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. 
 
వృషభం : శ్రీవారు శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. బంధువుల రాకతో గృహంలో కొత్త ఉత్సాహం, సందడి నెలకొంటుంది. బృంద, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. పెంపుడు జంతువులపై ప్రేమ, శ్రద్ధ వహిస్తారు. 
 
మిథునం : స్త్రీలకు షాపింగ్‌లోనూ, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. ప్రముఖుల కలయిక సాధ్యం కాకపోవచ్చు. నూతన వ్యాపారాలు, పరిశ్రమలకు కావలసిన వనరులు సమకూర్చుకుంటారు. మీ సంతానం విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఒప్పందాలు రవాణా వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. 
 
కర్కాటకం : వృత్తి వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవవుండదు. నిరుద్యోగులకు ఉపాథి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువుల కోసం ధనం విరివిగా వ్యయం చేయవలసి వస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. ఒకరి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి లోనవుతారు 
 
సింహం : పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. వైద్యులు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ ఏకాగ్రత అవసరం. పెద్దల సహాయంతో ఒక సమస్యను అధికమిస్తారు. వృత్తి ఉద్యోగాలు ఉపాధి పథకాలు ప్రశాంతంగా సాగుతాయి. సోదరీ, సోరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. 
 
కన్య : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి కలిసివచ్చే కాలం. ప్రైవేటు సంస్థలలోని వారికి ఆత్మనిగ్రహం చాలా అవసరం. అవసరాలు పెరిగినా ఆర్థిక ఇబ్బందులు అంతగా ఉండవు. ఏదైనా స్థిరాస్తి అమ్మకానికై చేయు యత్నం వాయిదా వేయడం మంచిది. ఉత్తరప్రత్యుత్తరాలు ఆశించినంత సంతృప్తికరంగా సాగవు. 
 
తుల : మీ ఆశయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిదికాదు. కళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. కొత్త రుణాలు, పెట్టుబడుల కోసం యత్నిస్తారు. 
 
వృశ్చికం : కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రయాణాలు ముఖ్యమైన చెల్లింపులలో మెలకువ వహించండి. ఏదైనా స్థిరాస్తి అమ్మకానికై చేయు యత్నం వాయిదా పడటం మంచిది. బుధువుల రాకతో కొంత అసౌకర్యానికి గురవుతారు. మీ శ్రీమతి ఓదార్పుతో మీలో మనోధైర్యం నెలకొంటుంది. 
 
ధనస్సు : మానసిక స్థైర్యంతో అడుగు ముందుకువేయండి. అనుకున్నది సాధిస్తారు. దీర్ఘకాలికంగా వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. రుణ, ఇతర వాయిదా చెల్లింపులు సకాలంలో జరుపుతారు. ప్రముఖులతో పరిచయాలు నూతన బంధుత్వాలు ఏర్పడతాయి.
 
మకరం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు సత్ఫలితాలనిస్తాయి. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక యత్నం ఫలించడంతో మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. వాతావరణంలోని మార్పు రైతులలో ఆదోళన కలిగిస్తుంది. 
 
కుంభం : స్త్రీల అభిప్రాయాలకు వ్యతిరేకత ఎదురవుతుంది. రావలసిన బకాయిలు వాయిదాపడుట వల్ల చికాకులు తప్పవు. దంపతుల మధ్య అకారణ కలహం, పట్టింపులు అధికమవుతాయి. విదేశీయత్నాలు ఫలిస్తాయి. ఆపత్సమయంలో సన్నిహితులకు అండగా నిలుస్తరాు. దైవ, పుణ్య కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మీనం : కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. ఏ వ్యక్తికీ అతి చనవు ఇవ్వడం మంచిదికాదు. శత్రువులను మీ వైపునకు ఆకట్టుకుంటారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

23-06-2020 మంగళవారం దినఫలాలు - ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే...