Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

23-06-2020 మంగళవారం దినఫలాలు - ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే...

Advertiesment
23-06-2020 మంగళవారం దినఫలాలు - ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే...
, మంగళవారం, 23 జూన్ 2020 (05:00 IST)
మేషం : ఆదాయపు లెక్కలు, తేడాలు అప్పటికప్పుడే పరిష్కరించుకోవడం మంచిది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, స్వశక్తిపై జీవించాలన్న పట్టుదల అధికమవుతాయి. పరోపకారానికిపోయి సమస్యలు తెచ్చుకోకండి. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత ముఖ్యం. 
 
వృషభం : గతంలో విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలిసే అవకాశం ఉంది. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. టెక్నికల్, వైజ్ఞానిక రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. చిన్నపాటి అనారోగ్యానికి గురై చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల అధికారులతో మాటపడక తప్పదు. 
 
మిథునం : కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాకయకం. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. తలపెట్టిన పనులు మందకొడిగా పూర్తిచేస్తారు. మీ శ్రీమతి సహకారంతో కొన్ని సమస్యలు సానుకూలమవుతాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. 
 
కర్కాటకం : ఆర్థిక సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి తప్పదు. బంధుమిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకం. 
 
సింహం : శ్రమాధిక్యత వల్ల అకాల భోజనం వంటి చికాకులు తప్పవు. ఆకస్మికంగా ఆలయాలను సందర్శిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. అనవసరపు ఆలోచనలతో మనసు పాడుచేసుకోకుండా అందరితో సంతోషంగా మెలగండి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. 
 
కన్య : రాజకీయ, కళా రంగాల వారికి కొంత అనుకూలిస్తుంది. గృహోపకరణాల వస్తువుల కొనుగోలుకై షాపింగ్ చేస్తారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగస్తులకు రావలసిన క్లెయింలు ఆలస్యంగా అందుతాయి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. 
 
తుల : వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. వసతి ఏర్పాట్ల విషయంలో చికాకులు ఎదురవుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో పెద్దల సలహా పాటించడం మంచిది. ప్రముఖులతో పరిచయాలు నూతన బంధుత్వాలు ఏర్పడతాయి. సంఘంలోనూ కుటుంబంలోనూ గౌరవ మర్యాదలు పొందుతారు. 
 
వృశ్చికం : వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. ఇతరుల సలహా కంటే సొంత నిర్ణయాలే మేలు. నిరుద్యోగులకు సదావకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. ఉద్యోగస్తులు నూతన పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండటం శ్రేయస్కరం. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. 
 
ధనస్సు : కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. బంధు మిత్రుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. 
 
మకరం : ఇంజనీరింగ్ రంగంలోని వారికి చికాకులు తప్పవు. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు వాయిదాపడవచ్చు. ఆలయాలను సందర్శిస్తారు. రవాణా, ప్రకటనలు, బోధన, స్టేషనరీ, విద్యా రంగాలవారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయ. 
 
కుంభం : రుణ, ఇతర వాయిదా చెల్లింపులు సకాలంలో పూర్తిచేస్తారు. వాతావరణంలో మార్పు మీ పనులకు ఆటంకమవుతుంది. మిత్రులతో ఏకీభవించలేకపోతారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలలోని వారికి యాజమాన్యం నుంచి ఒత్తిడి అధికమవుతుంది. 
 
మీనం : ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు. ఎల్.ఐ.సి, బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల ధనం అందుకుంటారు. సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెలకువ వహించండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

22-06-2020 సోమవారం దినఫలాలు - మల్లిఖార్జున స్వామిని ఆరాధిస్తే...